షకీలాకు చిలిపి ప్రశ్న: వర్మ 'జీఎస్‌టీ-2'లో చేయడానికి రెడీ.. కానీ!
Recommended Video

ఇప్పుడంటే సన్నీ లియోన్, మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్స్ వచ్చారు గానీ.. అప్పట్లో సెక్సీ క్వీన్ అంటే 'షకీలా'నే. ఒకానొక దశలో ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్న పరిస్థితి. తొంభైలలో ఆమె హవా అలా కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్లకు 'శీలవతి' టైటిల్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

'శీలవతి'గా షకీలా:
నిజానికి సినిమాలతో విసిగిపోయానని, పెళ్లి చేసుకుని సెటిల్ అవాలనుందని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది షకీలా. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ 'శీలవతి'గా మరోసారి రెచ్చిపోవడానికి సిద్దమైంది.

టైటిల్‌తో ఎటెన్షన్..:
షకీలా లాంటి బి-గ్రేడ్ సినిమాల స్టార్‌కు 'శీలవతి' అనే టైటిల్ పెట్టడంపై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా ఈ టైటిల్ తో ఒక్కసారిగా అందరి ఎటెన్షన్ తమవైపు తిప్పుకున్నారనే చెప్పాలి.

షకీలాకు చిలిపి ప్రశ్న:
'శీలవతి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఓ జర్నలిస్టు షకీలాకు చిలిపి ప్రశ్న వేశాడు. సౌత్ ఇండియాలో మీరో పాపులర్ శృంగార తార కదా.. 'జీఎస్‌టీ-2'లో వర్మ మీకు ఛాన్స్ ఇస్తే చేస్తారా? అని ప్రశ్నించాడు. ఇందుకు షకీలా కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.

వర్మతో చేయడానికి రెడీ.. కానీ :
'వర్మ ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం. వర్మ లాంటి దర్శకుడు అడిగితే వద్దంటానా?.. చేయడానికి నేను రెడీ. ఆయన కెమెరా యాంగిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయనలాగా అందాల్ని మరెవరూ చూపించలేరు. కానీ.. ఆయనకేమో సన్నగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం.' అని షకీలా బదులిచ్చింది.

అయ్యే పనికాదు:
'ఒకవేళ వర్మ నాకు ఛాన్స్ ఇచ్చినా.. ఆయన సినిమా కోసం ఇప్పటికిప్పుడు 30కిలోలు తగ్గమంటే అది అయ్యే పనికాదు.. నావల్ల కాదు' అంటూ షకీలా సరదాగా చెప్పుకొచ్చింది.

నచ్చితే చూడండి.. లేదంటే లేదు..:
'జీఎస్‌టీ' పైన వస్తున్న విమర్శలపై స్పందించాలని కోరగా.. 'మహిళా సంఘాల వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. నా సినిమాలకు కూడా వీళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవాళ్లు. మీకు ఇష్టముంటే సినిమా చూడండి. లేకపోతే లేదు. రచ్చ ఎందుకు' అంటూ స్పందించింది.

మానేసి.. మళ్లీ రీఎంట్రీ:
నిజానికి షకీలా అనుకోని పరిస్థితుల్లో సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లోకి వచ్చిందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఆమె బాల్యంలో ఎదురైన కొన్ని పరిస్థితులే ఆమెను ఇటువైపు నడిపించాయి. అయితే 2003నుంచి ఆమె సాఫ్ట్ పోర్న్ సినిమాలు మానేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు అనూహ్యంగా 'యూ టర్న్' తీసుకోవడం గమనార్హం.

'శీలవతి' వివరాలు..:
జీ స్టూడియోస్ పతాకంపై షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో 'శీలవతి' సినిమా మొదలైంది. ఈ సినిమాకు
WHAT THE F*** అనే ట్యాగ్ లైన్ పెట్టడం గమనార్హం. రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











