పవన్ తరపున ప్రచారం.. జగన్ గెలిస్తే ఇబ్బందులేనా .. దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చిన గెటప్ శ్రీను
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు సినీనటులు ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు కోటలు దాటుతూ .. అవి కాస్తా వివాదాస్పదమై కూర్చొంటున్నాయి. మరి అవతలి పక్షం ఊరుకుంటుందా.. అదే స్థాయిలో విమర్శలు, కౌంటర్లు దీనికి అదనంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్. ఈ క్రమంలో బుల్లితెర యాంకర్ శ్యామల అలియాస్ శ్యామలా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పక్షాన ప్రచారం చేస్తున్న ఆమె.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల పేరేత్తకుండా పరోక్షంగా చెప్పిన '' ముసలి తోడేలు - గుంట నక్క '' కథ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో శ్యామలపై టీడీపీ , జనసేన కేడర్ రగిలిపోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేరారు. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ''రాజు యాదవ్ '' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా అంకితా ఖరత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మే 17న రాజు యాదవ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గెటప్ శ్రీనును ఏపీ రాజకీయాలు, ఎన్నికల ప్రచారంపై విలేకరులు ప్రశ్నించారు. జనసేన తరపున క్యాంపెయినింగ్ చేస్తుండటంతో ఒకవేళ రేపు ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా అన్న ప్రశ్నకు గెటప్ శ్రీను ఆసక్తికరంగా బదులిచ్చారు. యాంకర్ శ్యామలకు కూడా ఇదే రకమైన ప్రశ్న ఎదురైతే ఆమె చెప్పినట్లుగానే శ్రీను ఆన్సర్ ఇచ్చారు.
ఒక పార్టీకి మద్ధతుగా నిలబడినంత మాత్రాన.. వారికి తొక్కేద్దాం అనుకోవడం పరిణితి చెందిన ఆలోచన కాదని గెటప్ శ్రీను అభిప్రాయపడ్డారు. ఒక గ్రామంలో ఉండే దుకాణదారుడు, ఆటో డ్రైవర్, ఓ వాటర్ ప్లాంట్ ఓనర్‌లు వేరు వేరు వృత్తులు చేస్తున్నా.. ఏదో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్‌గా వుంటారని ఈ విషయం ఊళ్లో కూడా తెలుసునని ఆయన చెప్పారు. అంతమాత్రం చేత ఆ ఆటోడ్రైవర్.. ఆ షాప్‌కెళ్లి కొనుక్కోకుండా ఉండడు, ఆ షాప్ ఓనర్ ఆ ఆటో ఎక్కకుండా ఉండడని శ్రీను వ్యాఖ్యానించారు. మన సినిమా బాగుంటే ప్రేక్షకులుగానే థియేటర్‌కు వెళ్తారు తప్పించి.. ఓ రాజకీయ పార్టీ సపోర్టర్‌గా ఎవరూ వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

ఇక.. పిఠాపురంలో ప్రచారానికి తనను నాగబాబు కానీ, జనసేన నేతలు కానీ ఆహ్వానించలేదన్నారు. తమకు తాముగా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నామని.. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో , ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే నేను, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ ఇంటింటికి తిరుగుతున్నామని గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. ప్రచారానికి డబ్బు తీసుకున్నామంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా ఆయన కౌంటరిచ్చారు. తన అకౌంట్ నెంబర్ ఇస్తామని చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications











