twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐఎఫ్ఎఫ్ఐ 2017: ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అమితాబ్

    ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నారు.

    By Bojja Kumar
    |

    గోవాలో గత 8 రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2017 వేడుక మంగళవారం సాయంత్రం ముగిసింది. పలువురు సినీ తారల లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ముగింపు వేడుక వైభవంగా సాగింది.

    ముగింపు వేడుకలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతల వివరాలు ప్రకటించారు. '120 బీట్స్ పర్ మినట్' చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నారు.

    ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్

    ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2017 వేడుకలో అక్షయ్ కుమార్, స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.

    ఉత్తమ నటి పార్వతి

    టేక్ ఆఫ్ చిత్రానికి గాను నటి పార్వతి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

    లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్

    కెనడియన్ ఫిల్మ్ మేకర్ ఆటమ్ ఇగోయమ్‌ను ఈ వేడుకలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.

    ఇతర అవార్డుల వివరాలు

    ఇతర అవార్డుల వివరాలు

    120 బీట్స్ పర్ మినట్ చిత్రానికి గాను నాహుల్ పెరెజ్ బిస్కాయర్ట్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
    ఏంజిల్ వేర్ వైట్ చిత్రానికి గాను వివియన్ క్యూ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.
    టేకాఫ్ చిత్రానికి గాను మహేష్ నారాయనన్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.

    English summary
    Akshay Kumar, who was the guest of honour at the closing ceremony of the 48th International Film Festival of India, honoured Amitabh Bachchan with the prestigious Film Personality Of The Year award in a very quirky way, leaving the crowd in splits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X