IFFI 2023 సినీ పరిశ్రమ అభివృద్దికి కేంద్రం సంచలన నిర్ణయం.. ఎన్ని కోట్లు ప్రకటించారంటే..
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 (IFFI 2023) 54వ వార్షిక వేడుకలు ఘనంగా గోవాలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి శాశ్వత వేదికగా మారిన గోవాలో ఈ వేడుకలను అట్టహాసంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, బిట్రిష్ ఫిల్మ్ మేకర్ స్టువార్ట్ గట్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో కేంద్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇఫీ (IFFI 2023) ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా మీడియా, సినిమా ప్రముఖులు తరలివచ్చారు. మాధురీ దీక్షిత్, షాహీద్ కపూపర్, శ్రీయా సరన్, నుస్రత్ బరుచా, పంకజ్ త్రిపాఠి, శంతను మోయిత్రా, శ్రేయా ఘోషల్, సుఖ్విందర్ సింగ్ తదితరులు హాజరవ్వడమే కాకుండా తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకొన్నారు.

భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తె లిపారు. భారత్‌లో విదేశీ చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సాహించే విధంగా తాయిలాలు, ప్రోత్సాహకాలను ప్రకటించారు. గతంలో బడ్జెట్‌పై ఉన్న పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. గతంలో 2.5 కోట్ల బడ్జెట్ పరిమితిని 30 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. విదేశీ చిత్రాల నిర్మాణాలను ఇండియాలో పోత్సహించే విధంగా భారీ ప్రోత్సాహాలను పెంచినట్టు ఆయన చెప్పారు. భారత్‌ను సినీ పరిశ్రమకు హబ్‌గా మార్చుతామని చెప్పారు.

ఇఫీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దాదాపు 75 మంది సృజనాత్మకతతో కూడిన నిపుణులను ఎంపిక చేశాం. 19 రాష్ట్రాల నుంచి 75 మంది ఫిల్మ్ మేకర్స్‌ను ఎంపిక చేశాం. ఓటీటీ విభాగంలో 10 భాషల నుంచి 32 సినిమాలను ఎంపిక చేశాం. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును అందజేస్తాం అని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.



Click it and Unblock the Notifications











