twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేటి నుంచే...గోవాలో సినిమా పండగ

    By Srikanya
    |

    హైదరాబాద్ : గోవా వేదికగా 45వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవానికి(ఇఫి) రంగం సిద్ధమైంది. నేటి నుంచి 30 వరకు జరగనున్న ఈ ఉత్సవాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, జయాబచ్చన్‌ ముఖ్య అతిథులగా ప్రారంభిస్తారు. జియాన్‌ సూ ఇల్‌ (దక్షిణ కొరియా), మోహ్‌సెన్‌ మక్‌మల్‌బఫ్‌ (ఇరాన్‌), పాలిస్‌ దర్శకుడు క్రిజిస్జ్‌టొఫ్‌ జానుస్సి కార్యక్రమానికి గౌరవ అతిథులు.

    ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ను 'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌' అనే పురస్కారంతో వేడుకలో సత్కరిస్తారు. చైనా దర్శకుడు వోంగ్‌ కార్‌ వాయ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం బహూకరిస్తారు. ఈ ఉత్సవంలో 79 దేశాలకు చెందిన 178 సినిమాలను ప్రదర్శిస్తారు. ఇండియన్‌ పనోరమా విభాగంలో 26 ఫీచర్‌, 15 నాన్‌ ఫీచర్‌ చిత్రాలను ప్రదర్శిస్తారు.

    IFFI kick starts from today

    'గాంధీ' దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బర్గ్‌, రాబిన్‌ విలియమ్స్‌, జోహ్రా సెహ్‌గల్‌, సుచిత్రా సేన్‌, ఫారుఖ్‌ షేక్‌లకు నివాళిగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

    ఇఫిలో చదువుకోవాలి

    బాలికల విద్య ఆవశ్యకత నేపథ్యంలో తెరకెక్కిన 'చదువుకోవాలి' చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవంలో సందడి చేయనుంది. ఈ ఉత్సవాల్లో'చదువుకోవాలి'ని ప్రదర్శించనున్నట్లు చిత్ర దర్శకనిర్మాత ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. వివిధ పురస్కారాలు, ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం ఇఫిలో ప్రదర్శనకు ఎంపిక కావడం హర్షణీయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు.

    English summary
    45th International Film Festival of India will be kick started on Thursday at Panaji, Goa with Big B Amitabh Bachchan inaugurating the festival. Union Ministers I&B minister Arun Jaitley, MoD Manohar Parrikar and MoS for I&B, Rajyavardhan Rathore will grace the occasion. Organisers will screen more than 178 foreign films in the 11 day extravaganza. Rajinikanth will be honoured with special centenary award for his contribution to Indian Cinema. Iranian film ‘The President’ will be screened on the opening day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X