'బాహుబలి'కి అంత పెద్ద అవమానం జరిగిందా...నిజమేనా?

By Srikanya

హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి చిత్రం కు ఘోర అవమానం జరిగినట్లుగా మీడియాలో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత..ఏ విషయంలో బాహుబలికి అంత పెద్ద అవమానం జరిగినట్లుగా మీడియా ప్రచారం చేస్తోంది అంటే ఈ క్రింద కథనం చదవాల్సిందే.

రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2016కు నామినేషన్స్ జరిగాయి. దాదాపు 230 సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. ఇందులో ఆరు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ 230 ఎంట్రీల నుంచి పిల్టర్ చేసి.. ఫెస్టివల్ లోప్రదర్శన కోసం 22 సినిమాలను ఎంపిక చేశారు. అయితే వీటిల్లో ఏ ఒక్క తెలుగు సినిమా లేకపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఫెస్టివల్స్ లో ప్రదర్శించే స్దాయిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

IFFI: No Telugu film selected for 47th International Film Festival

ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొంది, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరుతెచ్చుకున్న బాహుబలి సినిమాను కూడా సభ్యులు ఎంపిక చేయలేదనేది మీడియా ఎత్తి చూపుతున్న సత్యం.

అయితే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పేరొచ్చినందనో మరేమో కానీ ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ఎంపిక చేయకపోయినప్పటికీ ప్రదర్శనలో చోటు కల్పించారు. నవంబర్ 20న ఈ కార్యక్రమం గోవాలో జరగనుంది. దాంతో బాహుబలి లాంటి కళా ఖండానికి గౌరవం చూపకపోవటం అవమానమే అంటున్నారు.

IFFI: No Telugu film selected for 47th International Film Festival

ఈ విషయం గురించి తెలుగు సినీ నిర్మాత సివిరెడ్డి మాట్లాడుతూ... ఈ విషయంలో పూర్తి వైఫల్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదేనని చెప్పారు. సినీ పరిశ్రమకు ప్రోత్సహకాలు కల్పించినట్లయితే ఎన్నో గొప్ప కథలు తీయడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రాంతీయ చిత్రాలకు 50లక్షల సబ్సిడీని ప్రకటించిందని ఈ సందర్భంగా రెడ్డి గుర్తు చేశారు. తెలుగు సినిమా దర్శకులు కమర్షియల్ థోరణిలోనే వెళుతున్నారు తప్ప కథా ప్రాముఖ్యత కలిగిన సినిమాలను తీయడం లేదని చెప్పారు. సివిరెడ్డి ఈ చిత్రాలను ఎంపిక చేసిన బృందంలో సభ్యుడు కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X