రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ సంచలనం.. షాకిచ్చిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్
వ్యవహరించే తీరు, సోషల్ మీడియా సందేశాల ద్వారా వివాదాలకు మారు పేరయ్యారు రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడేం చేసినా.. ఏం మాట్లాడినా దాన్ని వివాదం చేసేయడం ఆయన స్టైల్. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ శేశారు వర్మ. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన ప్రాంగణంలోని జింకను తుపాకీతో కాల్చుతూ కనిపించాడు. దీన్ని పోస్ట్ చేసిన ఆర్జీవీ దేశంలో సల్మాన్‌కి ఒక న్యాయం.. ఇంకొకరికి ఇంకో న్యాయమా? అని ప్రశ్నించాడు. పోలీసులు, న్యాయస్థానం దీనికి ఏం సమాధానం చెబుతాయని తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు.

అయితే తాజాగా ఈ వీడియోపై ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్పందిస్తూ వర్మకు దిమ్మ తిరిగే షాకిచ్చాడు. వర్మ పోస్ట్ చేసిన వీడియో ఇక్కడిది కాదని.. బంగ్లాదేశ్‌లోనిదని, ఆ విషయం అక్కడి పోలీసులనే అడగాలని ఆయన కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ అంశం నెట్టింట పలు చర్చలకు దారితీసింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రాజకీయ కోణంలో సినిమాలు చేస్తున్న ఆయన ఇటీవలే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











