బ్యాంకాక్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2008 పురస్కారాల ప్రధానం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకునేలు ఉత్తమ కొత్త నటులుగా అవార్డులు అందుకున్నారు. తొలి చిత్రం 'సావరియా'లో నటనకుగానూ రణ్‌బీర్ కపూర్ ఈ అవార్డును అందుకోగా, దీపికా పదుకునే తన తొలి చిత్రం 'ఓం శాంతి ఓం' చిత్రానికి ఉత్తమ కొత్త కథానాయిక అవార్డు అందుకున్నారు. 'ఓం శాంతి ఓం' మరికొన్ని ఇతర విభాగాల్లోనూ అవార్డులు కైవసం చేసుకుంది. బాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు హాజరైన ఈ అవార్డు వేడుకలో అక్షయ్ కుమార్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఓం శాంతి ఓం చిత్రం బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.