IIFA Awards 2023: ఐఫాలో RRR బ్యూటీ హవా.. బెస్ట్ డైరెక్టర్‌గా సౌత్ హీరో.. విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే

సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు) ఒకటి. దేశంలోని పలు ఇండస్ట్రీలకు వేరు వేరుగా ఇచ్చే ఈ అవార్డుల వేడుక తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది.

ఇందులో హిందీ పరిశ్రమకు సంబంధించి పురస్కారాలను అందించారు. వీటిలో పలు చిత్రాలు హవాను చూపించి ఎన్నో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎవరిని వరించాయో పూర్తి వివరాలు మీరే చూడండి!

IIFA Awards 2023 Complete Winners List

వైభవంగా ఐఫా అవార్డు వేడుక: ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'ఐఫా' అవార్డుల కార్యక్రమం అబుదాబీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. వీళ్లతో పాటు సౌతిండియన్ సెలెబ్రిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.

IIFA Awards 2023 Complete Winners List

ఐఫా కార్యక్రమం సాగింది ఇలా: అబుదాబీలో జరిగిన 'ఐఫా' అవార్డుల కార్యక్రమానికి విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ సహా ఎంతో మంది హీరోయిన్లు తమదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. అలాగే, కొందరు హీరోలు కూడా అందరినీ అలరించారు. దీంతో ఈ వేడుక ఎంతో సందడిగా సాగిపోయింది.

IIFA Awards 2023 Complete Winners List

గంగూభాయ్‌ మూవీకే ఎక్కువగా: 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన 'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూభాయ్ కఠియావాడి' సినిమా హవాను చూపించింది. ఇందులో ఉత్తమ నటి, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ డెబ్యూ యాక్టర్ వంటి కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. దీని తర్వాత 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1'కు ఎక్కువ దక్కాయి.

IIFA Awards 2023 Complete Winners List

వాళ్లిద్దరికీ స్పెషల్ అవార్డులు: 2023 సంవత్సరానికి సంబంధించిన 'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో రెండు స్పెషల్ అవార్డులను కూడా ప్రకటించారు. అందులో విశ్వనాయకుడు కమల్ హాసన్‌కు 'అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' అవార్డును అందించారు. అలాగే, 'అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఫ్యాషన్ ఇన్ సినిమా' అవార్డును మనీష్ మల్హోత్రాకు అందించారు.

IIFA Awards 2023 Complete Winners List

ఐఫా అవార్డుల విజేతల లిస్ట్
ఉత్తమ చిత్రం: దృశ్యం 2
ఉత్తమ దర్శకుడు: మాధవన్ (రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్)
ఉత్తమ నటుడు: హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూభాయ్ కఠియావాడి)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (జగ్ జగ్ జీయో)
ఉత్తమ సహాయ నటి: మౌనీ రాయ్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ గేయ రచయిత: అమిత్ భట్టాచార్య (కేసరియా.. బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (కేసరియా.. బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (రసియా.. బ్రహ్మాస్త్ర పార్ట్ 1)
ఉత్తమ నూతన నటుడు: శాంతను మహేశ్వరి (గంగూభాయ్ కఠియావాడి)
ఉత్తమ నూతన నటి : కుషాలీ కుమార్ (దోఖా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: గంగూభాయ్ కఠియావాడి
ఉత్తమ స్క్రీన్‌ప్లే: గంగూభాయ్ కఠియావాడి
ఉత్తమ నృత్య దర్శకుడు: భూల్ భులాయా 2
ఉత్తమ సౌండ్ డిజైన్: భూల్ భులాయా 2
ఉత్తమ సంభాషనలు: గంగూభాయ్ కఠియావాడి
ఉత్తమ ఎడిటింగ్: దృశ్యం 2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర పార్ట్ 1
ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్ వేద
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: మౌనికా ఓ మై డార్లింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X