twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బరిలో తెలుగు స్టార్ హీరోలు, డైరెక్టర్లు: విన్నర్ ఎవరో?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) హైదరాబాద్‌లో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. డిసెంబర్ 4 నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ చిత్రాలకు సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. ఇప్పటికే తెలుగు విభాగం ఫంక్షన్ కు హోస్ట్‌గా వ్యవహరించేందుకు అల్లు శిరీష్ అంగీకరించి ఓ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే..రామ్ చరణ్ ఈ ఫంక్షన్‌లో స్టేజ్‌పై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటం.

    IIFA Utsavam 2015 Tollywood Nominees

    ఇక ఈ అవార్డుల బరిలో పలువురు కొత్త దర్శకులతో పాటు పలువురు స్టార్ డైరెక్టర్లు కూడా పోటీ పడుతున్నారు. ఉత్తమ దర్శకుడి పురస్కారం విభాగంలో స్టార్ డైరెక్టర్లు రాజమౌళి(బాహుబలి), పూరి జగన్నాథ్(టెంపర్), కొరటాల శివ(శ్రీమంతుడు)తో పాటు కార్తికేయ దర్శకుడు చందు మొండేటి పోటీ పడుతున్నాడు.

    మొత్తం టాలీవుడ్ నుంచి 5 సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో ఒకటి బాహుబలి, మరొకటి శ్రీమంతుడు కాగా మరొకటి పాఠశాల అనే చిన్న సినిమా... ఇక మిగతా రెండూ సినిమాలు నాని నటించినవే ‘భలేభలే మగాడివోయ్', ‘ఎవడే సుబ్రమణ్యం' సినిమాలు ఐఫా అవార్డుల రేసులో పోటీపడుతున్నాయి.

    ఉత్తమ నటుడు విభాగంలో ప్రభాస్ (బాహుబలి), నాని (భలే భలే మగాడివోయ్), మహేష్ బాబు (శ్రీమంతుడు), అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి), జూ ఎన్టీఆర్ (టెంపర్) పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో మంచు లక్ష్మి (దొంగాట), తమన్నా (బాహుబలి), లావణ్య త్రిపాటి (భలే భలే మగాడివోయ్), నిత్యా మీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), శృతి హాసన్ (శ్రీమంతుడు) పోటీ పడుతున్నారు.

    ఉత్తమ హస్యనటుడు విభాగంలో వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్), బ్రహ్మానందం (దొంగాట), వెన్నెల కిషోర్ (శ్రీమంతుడు), శ్రీనివాస రెడ్డి (పటాస్), భద్రం (జ్యోతి లక్ష్మి) పోటీ పడుతున్నారు. ఉత్తమ ప్రతి నాయకుడు అవార్డుకు రానా(బాహుబలి), ప్రభాకర్ (దొంగాట), కబీర్ సింగ్ (జిల్), అజయ్ గోష్ (జ్యోతి లక్ష్మి), సంపత్ (శ్రీమంతుడు) పోటీ పడుతున్నారు.

    ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఎంఎం కీరవాణి (బాహుబలి), రఘుకుంచె, సాయికార్తీక్, సత్యమహవీర్(దొంగాట), దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు), అనుప్ రూబెన్స్(టెంపర్), అనూప్ రూబెన్స్ (గోపాల గోపాల) పోటీ పడుతున్నారు.

    English summary
    The International Indian Film Academy (IIFA) will organise the first-ever “IIFA UTSAVAM” in December. The organisers aim to honour and recognise the best of South India’s film industry. The event is going to be held for 3 days from December 4 at Gachibowli Outdoor Stadium, Hderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X