twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐఫా ఉత్సవం: అవార్డుల్లో దుమ్మురేపిన జనతా గ్యారేజ్

    ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) -2017 సెకండ్ ఎడిషన్ వేడుకలు మార్చి 28,29 తేదీలలో ఘనంగా జరిగాయి.

    |

    హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) -2017 సెకండ్ ఎడిషన్ వేడుకలు మార్చి 28,29 తేదీలలో ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సెలబ్రిటీలు అందరు ఈ వేడుకకి హాజరు కాగా, పలువురిని ఐఫా పురస్కారాలతో సత్కరించారు.

    మార్చి 29న తెలుగు భాషకి సంబంధించి అవార్డుల వేడుకని నిర్వహించగా, ఈ కార్యక్రమాన్ని రానా, నాని హోస్ట్ చేశారు. అఖిల్, సాయిధరమ్ తేజ్, సమంత, రాయ్ లక్ష్మీ కార్యక్రమంలో తమ స్టెప్పులతో అలరించారు.

    ఈ వేడుకలో జూనియర్ కి ఐఫా బెస్ట్ అవార్డ్ తో సత్కరించగా, సమంత అ..ఆ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. అల్లు అర్జున్ రుద్రమదేవి చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు.

    IIFA Utsavam 2017 day 2: Janatha Garage, Kirik Party, U turn win top awards

    అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ రోల్ అందుకుంది. పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శిని కామిక్ రోల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోగా , మిగతా విభాగాలలో అవార్డు గెలుచుకున్న వారి వివరాలు క్రింద లిస్ట్ లో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

    బెస్ట్ మూవీ: జనతా గ్యారేజ్ - యమలమంచిలి రవిశంకర్
    బెస్ట్ స్టోరీ: క్రిష్ - కంచె
    బెస్ట్ డైరెక్షన్: కొరటాల శివ - జనతా గ్యారేజ్
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్): జూ.ఎన్టీఆర్ - జనతా గ్యారేజ్
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): సమంత - అ..ఆ..
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (మేల్): అల్లు అర్జున్ - రుద్రమదేవి
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (ఫిమేల్): అనుపమ పరమేశ్వరన్ - ప్రేమమ్
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ కామిక్ రోల్: ప్రియ దర్శి - పెళ్లి చూపులు
    బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇన్ నెగిటివ్ రోల్: జగపతి బాబు - నాన్నకు ప్రేమతో
    బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీశ్రీ ప్రసాద్ - జనతా గ్యారేజ్
    బెస్ట్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (వస్తానే - సోగ్గాడే చిన్నినాయనా)
    బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): హరిచరణ్ శేషాద్రి (నువ్వంటే నా నవ్వు - కృష్ణగాడి వీరప్రేమ గాథ)
    బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): గీతా మాధురి (పక్కా లోకల్ - జనతా గ్యారేజ్)
    ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా అవార్డ్: కే రాఘవేంద్ర రావు

    English summary
    The IIFA Utsavam 2017 saw a bevy of stars from Telugu and Kannada cinema gracing the event in Hyderabad to honour the best of 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X