పవన్ కళ్యాన్ ని కలవనున్న స్టేట్ టాపర్ పృద్వీతేజ్..!?
ఈ ఏడాది IIT JEE టాపర్ గా నిలిచిన పృద్వీతేజ్ త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలవనున్నాడు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో వచ్చిన ఇంటర్వ్యులో తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ని కలవాలనుందని పృద్వీ తేజ్ తన కోరికను వ్యక్తం చేశాడు. అది చూసిన నిర్మాత కొండా కృష్ణంరాజు వెంటనే ఈ విషయాన్ని కోల్ కతాలో షూటింగులో వున్న పవన్ కల్యాణ్ కి తెలియజేశారు.
ఆ వార్త విని ఎంతో సంతోషించిన పవన్ కల్యాణ్ వెంటనే పృద్వీతో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా హైదరాబాదులోని తన ఆఫీసు సిబ్బందిని ఆదేశించారు. సో.. త్వరలోనే పృద్వీ తన అబిమాన నటుడిని కలుసుకుని ముచ్చటించనున్నాడన్నమాట. ఇదిలా ఉంచితే, పృద్వీ ఇంటర్వ్యు చూసిన హీరో సిద్ధార్థ్ 'పృద్వీ తేజ్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలవాలనుంది... నాకేమో పృద్వీ తేజ్ ని కలవాలనుంది' అంటూ ట్విట్టెర్ లో పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











