»   » అజర్ ట్రైలర్, సన్నీ లియోన్ ఇజ్జత్, ఇంకా... (వీడియోస్)

అజర్ ట్రైలర్, సన్నీ లియోన్ ఇజ్జత్, ఇంకా... (వీడియోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో త్వరలో విడుదల కాబోతున్న పలు చిత్రాల ట్రైలర్స్ విడుదలయ్యాయి. అందులో ఇమ్రాన్ హస్మి నటించిన 'అజర్' చిత్రంతో పాటు, సన్నీ లియోన్ నటించిన 'వన్ నైట్ స్టాండ్', నానా పాటేకర్-హీరోయిన్ కాజల్ నటించిన 'ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్', '1920 లండన్' తదితర చిత్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు స్లైడ్ షోలో చూడొచ్చు.

- అజర్
టీమిండియా మాజీ కెప్టెన్ అజ‌రుద్దీన్ జీవిత క‌థ ఆధారంగా హిందీలో రూపొందుతున్న మూవీ అజ‌ర్. అజ‌ర్ పాత్ర‌ను ఇమ్రాన్ హాష్మి పోషిస్తున్నాడు. ఈ చిత్ర విశేషాల‌ను తెలియ జేసేందుకు ఇటీవ‌ల చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా హీరో ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ, ఈ చిత్రం రూపొందించేందుకు అజ‌రుద్దీన్ ఇచ్చిన స‌ల‌హాలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ్డాయ‌ని అన్నారు.. రెండు నెల‌ల పాటు బ్యాటింగ్ లో శిక్ష‌ణ ఇచ్చాడ‌ని పేర్కొన్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది. మే 13న సినిమా విడుదల కాబోతోంది.

-వన్ నైట్ స్టాండ్
సన్నీ లియోన్, తనూన్ విర్వానీ జంటగా నటిస్తున్న చిత్రం 'వన్ నైట్ స్టాండ్'. ఈ చిత్రానికి జాస్మిన్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. భవానీ ఐయ్యర్ ఈ సినిమాకు కథ అందించారు. ప్రదీప్ శర్మ నిర్మాత. స్విస్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సన్నీ లియోన్-తనూజ్ విర్వానీ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నీ వేశాలు ఆకట్టుకుంటున్నాయి. అత్యంత శృంగార భరితంగా ఉన్న ఈ సీన్లు చూసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ టెమ్ట్ అయిపోతున్నారు.

స్లైడ్ షోలో వీడియోలు..

అజర్

అజర్ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. మంచి స్పందన వస్తోంది.

సన్నీ లియోన్ ఇజ్జత్

వన్ నైట్ స్టాండ్ చిత్రంలోని ‘ఇజ్జత్' సాంగ్ వీడియో

rn

ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్

ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ అఫీషియల్ ట్రైలర్

1920 లండన్

1920 లండన్ చిత్రానికి సంబంధించిన అపీషియల్ ట్రైలర్

English summary
Watch Sunny Leone starring Ijazat Video Song from upcoming movie ONE NIGHT STAND in the melodious voice of Arijit Singh & Meet Bros, music composition by Meet Bros & lyrics written by Shabbir Ahmed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu