twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ సాంగ్స్ ఎలా పుడతాయంటే...ఇళయరాజా

    By Srikanya
    |

    ''నేను సూపర్‌ హిట్‌ పాటలు ఇచ్చానని అందరూ అంటున్నారు. ప్రత్యేకంగా హిట్‌ సాంగ్స్‌ అంటూ ఏమీ ఉండవు. మనకు నచ్చినవి, ఇష్టంలేనివి మాత్రమే ఉంటాయి అన్నారు ఇళయరాజా. మనకు ఇష్టంలేని పాటల్లో కూడా సప్తస్వరాలు ఉంటాయి. సప్తస్వరాల్లో అన్ని రకాల భావోద్వేగాలుంటాయి. ప్రేమ, కోపం, ద్వేషం, శృంగారం ఇలా అన్నీ ఉంటాయి. వాటిని మనం కలిపే చూడాలి తప్ప విడదీసి కాదు. నాకు సంగీతం గురించి తెలియదు. కాబట్టే సంగీతం చేస్తున్నాను. తెలిసుంటే హాయిగా ఇంట్లో కూర్చొనేవాణ్ని. నా దగ్గరకు వచ్చే దర్శకులందరూ ఏదో అనుకొని వస్తుంటారు. మీరు ఫలానా సినిమాకి ఇచ్చిన స్వరాలే నా సినిమాకి ఇవ్వాలని రజనీకాంత్‌ ఫోన్‌ చేసి అడిగారు. అప్పుడు చెప్పాను వాళ్లు వచ్చినపుడు ఆ ట్యూన్స్‌ వచ్చాయి. మీకు వేరే ట్యూన్స్‌ వస్తాయి. వాటినేమన్నా రిజర్వ్‌ చేసుకోవాలా ఏంటి? అని చెప్పాను. భారతీరాజా సన్నివేశం చెప్పి అంతా మీ ఇష్టం అని నాకే వదిలేస్తారు. అయిదు పాటలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చెప్పేస్తాను. స్వరాలనేవి పాట రాసినవాళ్లకి, పాడేవాళ్లకి, రికార్డ్‌చేసే వాళ్లకి నచ్చాలి. ఇలా ఇన్ని చెక్‌ పాయింట్లు దాటుకొని మంచి పాటలు ఇవ్వాల్సి ఉంటుంద''న్నారు.

    హైదరాబాద్‌లో 'ఓంశాంతి'లోని పాటలు శనివారం విడుదలయ్యాయి. తొలి సీడీని ఇళయరాజా ఆవిష్కరించి శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావుకి అందచేశారు. ఈ కార్యక్రమంలో సి.అశ్వనీదత్‌, శేషుప్రియాంక, మురళీమోహన్‌, కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, యండమూరి వీరేంద్రనాథ్‌, మెహర్‌ రమేష్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. సోనీ మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి. త్రీ ఏంజిల్స్‌ స్టూడియో ప్రై.లి. సంస్థ నిర్మించిన చిత్రం 'ఓం శాంతి'. నవదీప్‌, నిఖిల్‌, కాజల్‌, బిందుమాధవి, అదితిశర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. శేషు ప్రియాంక చలసాని నిర్మాత. ప్రకాశ్‌ దర్శకుడిగా పరిచయవుతున్నారు. ఈ సంస్ధ ఇంతకు ముందు బాణం చిత్రం నిర్మించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X