తేజ దర్శకత్వం వహిస్తున్న 'కేక' సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాప్ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ను కెమెరామన్ గా పెట్టుకోవడంలో ఇప్పటికే తేజ విజయం సాధించారు. ఇళయారాజాను ఒప్పించేందుకు తేజ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. స్వయంగా సినిమాటోగ్రాఫర్ అయిన తేజ పి.సి. శ్రీరామ్ తో కలిసి పనిచేయడాన్ని ఆనందకరమైన విషయంగా భావిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాకు సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారు. ఈ నెలాఖరున 'కేక' సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
Story first published: Thursday, July 16, 2026, 22:38 [IST]