ఇండస్ట్రీలో మరో విషాదం.. ఇళయరాజ కూతురి మృతి.. ఎలా చనిపోయిందంటే?

కొంత కాంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గతేడాదిలో అనేక మంది సినీ ప్రముఖులు ప్రాణాలు విడిచారు. 2023 సంవత్సరంలో కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ, చంద్ర మోహన్ వంటి దిగ్గజ నటులను పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూతురు నేలకొరిగింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కూతురు సింగర్ భవతారణి ప్రాణాలు విడిచింది.

ఇళయరాజా ఒక్కగానొక్క కూతురు అయిన భవతారణికి ప్రస్తుతం 47 ఏళ్ల వయసు. అయితే 1976 జులై 23వ తేదీన జన్మించిన ఈమె గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. అయినా సరే ఈమె ఆరోగ్యం బాగు పడక పోగా.. మరింత దిగజారిపోయింది. ఇలా ఈరోజు సాయంత్రం శ్రీలంకలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Ilayarajas Daughter Singer Bhavatharini passed away Check Details

ఇళయరాజాకు మొత్తం ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజాలు కాగా.. ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరే భవతారణి. అయితే ఈమె కూడా గాయనిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఎక్కువగా తన తండ్రి మరియు సోదరుల దర్శకత్వంలో పాటలు పాడింది. ఆమె తండ్రి ఇళయరాజా స్వరపరిచిన భారతి చిత్రంలోని "మయిల్ పోల పొన్ను ఒన్ను" పాటను పాడినందుకు 2000లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.

భవతారణి ఎక్కువగా తమిళంలో పాటలు పాడింది. అద్భుతమైన గాత్రంతో ఎంతో మందికి ఫేవరెట్ సింగర్ గా నిలిచిన ఈమె మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే క్యాన్సర్ తో చనిపోవడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కల్గడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X