మా మధ్యలో ఉండే గొడవలు కూడా స్నేహమే.. ఎస్పీ బాలుపై ఇళయరాజా ఎమోషనల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి బాలేదన్న విషయం తెలిసిన క్షణం నుంచి భారత సనీ సంగీత ప్రపంచంలో ఆందోళనకు గురవుతోంది. గత కొన్ని రోజుల క్రితం తనకు కరోనా సోకిందని, అంతా బాగానే ఉన్నానని ఎవ్వరూ కంగారుపడొద్దని స్వయంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఆగస్టు 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషమించడంతో ఐసీయూ నుంచి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించిన వార్త మరింత కలవరపాటుకు గురి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసినా.. సినీ ప్రముఖులంతా ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఎవ్వరూ ఫోన్ చేయొద్దు..

ఎవ్వరూ ఫోన్ చేయొద్దు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా అని తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు నిరంతరం ఫోన్స్, మెసెజ్‌లు చేశారు. ఇక వీటి ధాటికి తట్టుకోలేక ఓ వీడియోను బాలు రిలీజ్ చేశారు. తాను ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని, ఎవ్వరూ ఫోన్స్ చేయోద్దని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాడు.

పరిస్థితి విషమం..

పరిస్థితి విషమం..

ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇక బాలు ఆరోగ్యం సీరియస్‌గా ఉందనే వార్తలు రావడంతో సంగీత ప్రపంచం ఉలిక్కి పడింది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

గొడవలు కూడా స్నేహమే..

గొడవలు కూడా స్నేహమే..

ఇళయరాజా, బాలు మధ్య జరిగిన గొడవల సంగతి తెలిసిందే. తన పాటలు పాడొద్దని, కాపీ రైట్ అంటూ బాలుపై ఇళయరాజా కేసు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలు ఆరోగ్యంపై ఇళయరాజా స్పందిస్తూ.. ‘బాలు త్వరగా తిరిగి రా, నేను నీ కోసం ఎదురుచూస్తున్నా.. మన స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు.

నా అంతరంగం..

నా అంతరంగం..

అంతకు మించి.. మనం గొడవ పడిన సందర్భాల్లో కూడా మన స్నేహం అలాగే ఉంది. మనం మాట్లాడుకోని రోజులు కూడా మంచి రోజులే. ఎల్లప్పుడూ మన మధ్య ఉన్నది కేవలం స్నేహమే. నువ్ బాగున్నానవి, బాగుంటావని, త్వరగా తిరిగి వస్తావని నా అంతరంగం చెబుతోంద' అని అన్నారు.

Recommended Video

SP Balasubrahmanyam : ICU కి తరలింపు, కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ఫ్యాన్స్ | Oneindia Telugu
చిరు, రెహ్మాన్, అనిరుద్..

చిరు, రెహ్మాన్, అనిరుద్..


ఎస్పీబీ ఆరోగ్యం పట్ల భారత చిత్ర సీమ మొత్తం ఆందోళన చెందుతోంది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, అనిరుద్ రవిచంద్రన్, చిత్ర, శంకర్ మహదేవన్ వంటి మహామహులు బాలు ఆరోగ్యంపై ఆవేదన చెందున్నాతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా బాలు ఆరోగ్యంపై ఆవేదన చెందారు.

కుటుంబ సభ్యుల క్లారిటీ..

కుటుంబ సభ్యుల క్లారిటీ..

బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్, కూతురు ఎస్పీ వసంత మీడియాతో మాట్లాడారు. బాలా సుబ్రహణ్యం ఆరోగ్యం కుదుటపడిందని, ఎవరు కంగారు పడొద్దని ప్రకటించారు. ఆయన గురించి ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X