ఇళయరాజా వల్లనే విలువ వచ్చింది: కీరవాణి
ఆయన రాక ముందు సంగీత దర్శకులకు పెద్దగా విలువ ఇచ్చే వారు కాదు. ఇళయరాజా వచ్చిన తర్వాతనే పరిస్థితి పూర్తిగా మారింది. ఇళయరాజాగారి సంతకం ఉంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే క్రేజ్ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఇన్ఫిరేషన్తో ఎంతో మంది యువ దర్శకులు పెద్ద పెద్ద జాబులపై ఆశలు వదిలేసి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారని చెప్పుకొచ్చారు. ఆయన్ను సరస్వతి పుత్రుడిగా, మహా సంగీత జ్ఞాని'' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కీరవాణి.
మోహన్ బాబు మాట్లాడుతూ... ఇళయరాజా అందించిన సంగీతం మా సినిమాకు చాలా ప్లస్సవుతుంది. ఇళయరాజాగారితో అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ... ఇళయరాజా గారి వద్దకు వెళ్లి మా సినిమా చేయాలని అడిగాను. ఒకే రోజు ఆరు పాటలు రెడీ చేసి ఇచ్చారు. రీ రికార్డింగ్ అయిపోయాక ఆయనకు థాంక్స్ ఎలా చెప్పాలో తెలియక వెక్కి వెక్కి ఏడ్చాను. ఈ మ్యూజిక్ నాది అని గర్వంగా చెప్పుకుంటాను. అంత బాగా వచ్చింది ఈ సినిమా సంగీతం అన్నారు.


Click it and Unblock the Notifications












