‘ధోనీ’ ఆడియో వేడుకలో ఇళయరాజా లైవ్ షో
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'ధోనీ' సినిమా ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 30న సినిమా ఆడియో వేడుక ఉన్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారని, ఆడియో సంగీత ప్రియులతో పాటు సాహిత్య ప్రియులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆడియో వేడక సందర్భంగా ఇళయరాజా తన బృందంతో లైవ్ షో ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకోనుందని తెలిపారు.
నేటి విద్యా వ్యవస్థను ప్రశ్నించే అంశాలతో పాటు, తల్లిదండ్రులు...విద్యా సంస్థలు తీరును ఎండగడుతూ సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోంది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రకాష్ రాజ్, పూరి తనయుడు ఆకాష్ తండ్రి కొడుకులుగా నటించనున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో రాధిక ఆప్టే, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, నాజర్, అనంత్, గుండు హనుమంతరావు, మురళీ శర్మ, కస్తూరి హరి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మాటలు: టి.జె.జ్ఞానవేల్, మహేష్ రాజా, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటర్ : కిషోర్, బ్యానర్: డ్యూయోట్ మూవీస్, నిర్మాత, దర్శకత్వం: ప్రకాష్ రాజ్


Click it and Unblock the Notifications











