twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయగర్వంలో ఇలియానా...!

    By Bojja Kumar
    |

    ముంబై: సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా...బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదలై గ్రాండ్ విక్టరీ కొట్టడమేకాదు...ఆస్కార్‌కి నామినేట్ అయింది కూడా..

    ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    ఈ చిత్రం గురించి ఇలియానా మాట్లాడుతూ...'బర్ఫీకోసం తాను మంచి మంచి అవకాశాలను వదులుకున్నానని, గ్లామర్ లేకపోయినా తన ఫిజిక్ చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని, తన కెరీర్‌లోనే ఓ గొప్ప విజయంగా బర్ఫీని చెప్పుకుంటానని తెలిపింది. కమర్షియల్‌గా ఈ కథ విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు తప్పక లభిస్తాయని తనకుముందే తెలుసని, అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంత విజయం అందించడం మాత్రం సరికొత్తగా ఉందని, ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది అని అంటోంది.

    తొలి చిత్రమే సక్సెస్ బాట పట్టడంతో ఇలియానాకు బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో ముగిసిందనుకున్న ఇలియానా చరిత్ర బాలీవుడ్‌లో మొదలవుతోంది. గతంలో అసిన్, జెనీలియా లాంటి వారు దక్షిణాదిన వెలిగి బాలీవుడ్లో అడుగిడిన వాళ్లే. ఆ తర్వాత వాళ్లు దక్షిణాది సినిమాలు చేయడమే మానేసారు. మరి ఇలియానా కూడా వారి బాటలో నడుస్తుందా..? లేక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ, అక్కడ రాణిస్తుందా? అనే చర్చమొదలైంది.

    English summary
    Actress Ileana D’Cruz, who began her career in Bollywood with “Barfi”, said she was proud to be part of the team and that it was an honour and privilege and a matter of pride to get an official entry to the Oscars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X