నన్నెవరూ విమర్శించాల్సిన పనిలేదు: ఇలియానా
శక్తి ఘోరమైన పరాజయం పొందటంతో తెలుగులో సినిమాలు లేక అంతకు ముందు ఒప్పుకున్న తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉన్నట్లు చెప్పుకుంటున్న ఇలియానా ప్రస్తుతం దృష్టంతా బాలీవుడ్ పైనే పెట్టింది. శంకర్ దర్శకత్వంలో విజయ్ సరసన తమిళ చిత్రం 'నన్బన్" లో నటిస్తున్న ఇలియానాకు దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న ఏకైక సినిమానట. సినీ ఫీల్డ్ లోకి వస్తాననీ గానీ, ఇంత పేరు తెచ్చుకుంటానని గానీ ఏమాత్రం ఊహించలేదని అంటోన్న ఆమె 'ఇక్కడికి వచ్చేముందు ఎవరూ నాకు తెలీదు. వచ్చాను. ప్రేక్షకుల ఆదరణ పొందాను. ఈ ఫీల్డ్ లో ఎలా ఉండాలో ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నా.
నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను, వ్యవహరిస్తాను. ఫ్రాంక్ గా ఉండాలనేది నా అభిమతం. కొన్ని సందర్భాల్లో అలా ఉండటం ఇబ్బందులు కలిగించినా, అదే సరైనదనుకుంటా. ఒక వ్యక్తిగా నన్ను నేను అర్థం చేసుకున్నా చాలా మంది సపోర్ట్ లభించడంల వల్లే నాకీ పేరు వచ్చిందని నమ్ముతాను. నా పనిని నేను ప్రేమించా. నన్నెవరూ విమర్శించాల్సిన పనిలేదు. ఎందుకంటే నాకు నేనే పెద్ద విమర్శకురాలిని. ఏ సినిమా అయినా ఒప్పుకునేప్పుడు నా పాత్ర ఎలా ఉందో తరచి చూసుకుంటూ, సెట్స్ మీద డైరెక్టర్ ఓ సీన్ చెబితే దాన్నెలాగ చేయాలో అర్ధం చేసుకుని నటిస్తా. నేను సరిగా చేశానో లేదో చెక్ చేసుకుంటా. సరిగా చేయలేదనుకుంటే ఇంకో టేక్ చేస్తానని చెబుతా.."అంటూ అడక్కపోయినా చెప్పుకొచ్చింది ఈ అందాల తార.


Click it and Unblock the Notifications











