'సలీమ్‌'లో నా కేరెక్టర్‌ ఎలా ..ఇలియానా

By Srikanya

ప్రతి హీరోయిన్ కోరుకునే డ్రీమ్‌ కేరెక్టర్‌లా నా పాత్ర ఉంటుంది. గ్లామర్‌తోపాటు చక్కని నటన కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న హీరోయిన్ పాత్రని నేనీ చిత్రంలో ధరించాను. నా కెరీర్‌లో నేను ధరించిన మంచి పాత్రల్లో ఈ చిత్రంలోని పాత్ర కూడా ఒకటిగా నిలుస్తుంది అంటోంది ఇలియానా. అంతేగాక వై.వి.ఎస్‌.చౌదరి గారు ఈ చిత్రంలో నా కేరెక్టర్ని ఎంతో చక్కగా మలిచారు. 'దేవదాసు' సినిమా ద్వారా నాకెంతటి పేరు వచ్చిందో, అంతకు రెండింతలు పేరును 'సలీమ్‌' చిత్రం ద్వారా సంపాదించుకుంటానన్న నమ్మకం ఉంది. 'దేవదాసు' తర్వాత వైవియస్ చౌదరి దర్శకత్వంలో మరోసారి నటించాలని ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. 'సలీమ్‌' ద్వారా మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఒక అమర ప్రేమికుడి కథతో రూపొందించిన 'దేవదాసు' చిత్రం ద్వారా వై.వి.ఎస్‌.చౌదరి గారు నాకు జీవితంలో గొప్ప బహుమతిని అందించారు. ఇప్పుడు మరో అమర ప్రేమికుడు సలీమ్‌ పేరుతో రూపొందించిన 'సలీమ్‌' చిత్రాన్ని నాకు మరో బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా వై.వి.ఎస్‌. చౌదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక హీరో మంచు విష్ణు సరసన చెయ్యటం గురించి చెపుతూ..విష్ణు ఎంతో సరదాగా ఉండే నటుడు. షూటింగ్‌ సమయంలో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయనతో కలసి 'సలీమ్‌' చిత్రానికి పనిచేయడం సంతోషాన్ని కలిగించింది. అలాగే ప్రతిష్ఠాత్మక శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ నిర్మించన చిత్రంలో నటించడం కూడా మరో చక్కని అనుభూతి. మొత్తంమీద 'సలీమ్‌' నాకు ఎన్నో ఆనందాలు కలిగించిన చిత్రం. ఈ చిత్రం విజయం మీద నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా చెపుతోంది. బెస్టాఫ్ లక్ ఇలియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X