నా వాడు ఎలా ఉండాలంటే...: ఇలియానా
ఎవరైనా సరే ఆస్తి, హోదా.. కంటే మంచి మనసున్న మగాడినే కోరుకొంటారు. నేనూ అంతే. ఎదుటి వారిలో ఎక్కువగా ఇష్టపడేది నిజాయతీనే. కాబోయే వాడు ఎవరైనా ఈ లక్షణం తప్పకుండా చూస్తా అంటూ మనస్సులో మాట చెప్పుకొచ్చింది ఇలియానా. అలాగే నాకు తగిన జోడీ ఎవరన్నది పైన ఉన్న భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టేశాడు. వెతికిపెట్టే బాధ్యత మా మమ్మీ తీసుకొంటుంది..రేపటి జీవితం గురించి ఆలోచించేంత అవసరం ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ లేదు. అందుకే పెళ్లి గురించి, కాబోయే భర్త గురించీ ఇప్పటి నుంచే కలలు కనడం లేదు అని స్ఫష్టంగా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ గోవా భామ 'జులాయి' కోసం అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న ఈమె రవితేజతో రెండోసారి ఆడిపాడనుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతన్న దేముడు చేసిన మనుష్యులు చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. తమిళ,హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది''అని చెప్పింది.
ఇక దక్షిణాదిలో ఇలియానా కెరీర్ విషయానికి వస్తే, 'కిక్' తర్వాత వరుసగా ఐదు ఫ్లాప్‌లు రావడంతో ప్రస్తుతానికి ఇక్కడ డల్‌గానే ఉంది. ఈ మధ్యనే తమిళ దర్శకుడు శంకర్ తీసిన 'స్నేహితుడు' (అమీర్‌ఖాన్ '3 ఈడియెట్స్' రీమేక్)లో కనిపించిన ఈమెకు కలిసిరాలేదు. ఆ సినిమా ప్లాప్ కావటం ఆమెకు తెలుగులో ఇబ్బందికర పరిస్దితి తెచ్చిపెట్టింది. దాంతో ఆమె తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.
అక్షయ్ కుమార్ హీరోగా నిర్మించబోయే 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై 2', 'ఖిలాడీ 786' చిత్రాల్లో ఇలియానాకు అవకాశం సంపాదించింది. 2010లో ఏక్తా కపూర్ నిర్మించిన 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై'కి ఈ చిత్రం సీక్వెల్ . మాఫియా డాన్‌లు దావూద్ ఇబ్రహీం (అక్షయ్), చోటా రాజన్ (షాహిద్)ల మధ్య గల శతృత్వమే దీని ఇతివృత్తం. ఇక రెండో సినిమా 'ఖిలాడీ 786'ని హాస్య ప్రధాన చిత్రంగా అక్షయ్, హిమేష్ రేష్మియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో అనురాగ్ బసు రూపొందించిన 'బర్ఫీ'లో రణ్‌బీర్ కపూర్ భార్యగా ఇలియానా చేయటం ఆమెకు కలిసివచ్చింది. అయితే రిలీజైన తర్వాత గానీ ఆమె కేరీర్ ఏ రేంజికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ పండితులు.


Click it and Unblock the Notifications











