త్రివిక్రమ్ రిస్క్ చేస్తున్నారేమో: ఇలియానా
అల్లు అర్జున్ సరసన నటిస్తున్న చిత్రంలో నా పాత్ర బాగుంటుంది. నాకు ఇలాంటి పాత్ర ఇచ్చి త్రివిక్రమ్ రిస్క్ చేశారేమో అనిపించింది. ఆయన దర్శకత్వంలో మళ్లీ నటించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. బన్నీతో నాకిదే తొలి సినిమా. ఆయన సెట్లో ఉంటే సందడే సందడి. బన్నీని బడ్డీ అని పిలుస్తాను అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది ఇలియానా. ఆమె గతంలో త్రివిక్రమ్ డైరక్షన్ లో జల్సా చిత్రం చేసింది. ఇప్పుడు మరో సారి చేస్తోంది. ప్రస్తుతం ఆమె శంకర్ దర్శకత్వంలో 'నన్బన్' చిత్రంలో నటించి తమిళనాట విజయం దక్కించుకుంది. ఈ చిత్రం తెలుగులో 'స్నేహితుడు'గా 26న వస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది.
అలాగే 'స్నేహితుడు' మంచి సినిమా. వినోదం ఉంటుంది, ఆలోచింపజేస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే చదువు పట్ల స్టూడెంట్స్‌కి ఆసక్తి కలుగుతుందో చెప్పే చిత్రం ఇది. నేను ఇంట్రస్ట్‌గా కాలేజ్‌కి వెళ్లేదాన్ని కాదు. క్లాస్‌రూమ్‌లో లెక్చరర్ పాఠాలు చెబుతుంటే వినాలనిపించేది కాదు. కానీ ఆసక్తి కలిగించే రీతిలో చెబితే ఎలాంటి స్టూడెంట్‌కైనా చదువు మీద ఇంట్రస్ట్ ఏర్పడుతుంది. ఈ చిత్రంలో చెప్పింది అదే. ఈ మంచి పాయింట్‌కి వినోదం కూడా జోడించి తీశారు కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏదేమైనా ఈ ఏడాది తమిళంలో 'నన్బన్' సక్సెస్‌తో పాజిటివ్‌గా ఆరంభమైంది. తెలుగులో 'స్నేహితుడు'తో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అంటోంది.
అలాగే 'నన్బన్'సక్సెస్ గురించి చెపుతూ.. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తమిళంలో నటించాను. శంకర్ లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం దక్కడం అదృష్టం. ఆయనతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. ప్రతి చిన్న విషయం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారాయన. శంకర్ నుంచి నేను నేర్చుకున్న విషయం ఓర్పుగా పనిచేయడం అందామె.


Click it and Unblock the Notifications











