Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దానికోసమే వెంపర్లాడను: ఇలియానా
ఈ రంగంలో ఉంటున్నాం కాబట్టి... ఇక్కడొచ్చే కీలక మార్పుల్ని గమనించడం ఎంతైనా అవసరం. అలాగని నిత్యం కొత్తదనం కొత్తదనం అంటూ కేవలం దానికోసమే వెంపర్లాడను. నాకు ఎంతవరకూ అవసరమో ముందు వాటి గురించి మాత్రమే తెలుసుకుంటాను. నేను నేర్చుకున్న విషయాల్ని నలుగురితో పంచుకోవాలని ఆశపడతాను అంది ఇలియానా. ఆమెను మీడియా వారు సినిమా రంగానికి సంబంధించిన కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటుంటారా? అని అడిగితే ఇలా స్పందించింది. అలాగే...ఏదైనా విషయం గురించి తెలియకపోతే నిర్మొహమాటంగా అడిగి మరీ తెలుసుకుంటాను.
అంతేకానీ తెలుసని మాత్రం అబద్ధం చెప్పను. ఇతరులు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటాను అంది. ప్రస్తుతం ఆమె 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్లో బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్ చిత్రంలో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ చిత్రం అప్పుడే బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది.