twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దానికోసమే వెంపర్లాడను: ఇలియానా

    By Srikanya
    |

    ఈ రంగంలో ఉంటున్నాం కాబట్టి... ఇక్కడొచ్చే కీలక మార్పుల్ని గమనించడం ఎంతైనా అవసరం. అలాగని నిత్యం కొత్తదనం కొత్తదనం అంటూ కేవలం దానికోసమే వెంపర్లాడను. నాకు ఎంతవరకూ అవసరమో ముందు వాటి గురించి మాత్రమే తెలుసుకుంటాను. నేను నేర్చుకున్న విషయాల్ని నలుగురితో పంచుకోవాలని ఆశపడతాను అంది ఇలియానా. ఆమెను మీడియా వారు సినిమా రంగానికి సంబంధించిన కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటుంటారా? అని అడిగితే ఇలా స్పందించింది. అలాగే...ఏదైనా విషయం గురించి తెలియకపోతే నిర్మొహమాటంగా అడిగి మరీ తెలుసుకుంటాను.

    అంతేకానీ తెలుసని మాత్రం అబద్ధం చెప్పను. ఇతరులు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటాను అంది. ప్రస్తుతం ఆమె 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌లో బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్‌ చిత్రంలో నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ చిత్రం అప్పుడే బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది.

    English summary
    Ileana Says that she always updates about film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X