ఆ విషయంలో పూరి, త్రివిక్రమ్ బెస్ట్: ఇలియానా
హైదరాబాద్: గోవా బ్యూటీ ఇలియానా త్వరలో 'జులాయి', 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్రాల దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తోంది ఇలియనా. ఆరిస్టులు వెంటనే ఒకే చేసేలా అద్భుతంగా సినిమా స్టోరీ వివరిస్తారు. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ...మాతో పర్ ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు, వారి దర్శకత్వంలో చేసిన ఎవరైనా నటన పరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండదు, అంత అద్భుతంగా చేయిస్తారు అని చెబుతోంది.
నా దృష్టిలో నటన అనేది ఒక గొప్ప కళ. ఎంతో మందికి వినోదాన్ని పంచే ఈ వృత్తిలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నటుల్లో ఎంత టాలెంట్ ఉన్నా, కథలో దమ్మున్నా దర్శకుడు సరిగా లేక పోతే సరైన ఫలితం ఉండదు. అందుకే దర్శకుడి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగేస్తాను. తన రాబోయే సినిమాలు తప్పకుండా మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం ఉందని చెప్పింది.
జులాయి చిత్రంలో అల్లు అర్జున్ హీరో. ఆగస్టు 9న ఈచిత్రం గ్రాండ్ 1600 థియేటర్లలో విడుదలువుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఇలియాన రవితేజతో జత కడుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో ఇలియాన టాక్సీ డ్రైవర్ గా నటిస్తోంది. ఆగస్టు 15న ఈచిత్రం విడుదల కానుంది. రియలన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి చాలా కాలంగా సరైన హిట్టులేని ఇలియానా ఈ రెండు చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











