నా జీన్స్ ప్యాంట్ ఇస్తా చెక్ చేసుకోండి: ఇలియానా
"కావాలంటే నా జీన్స్ ప్యాంట్ ఇస్తాను. సైజ్ చెక్ చేసుకోవచ్చు. నా సైజ్ '4'. నేను బాగా సన్నబడ్డానని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే నాది 'జీరో సైజ్' అని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అలా ఫిక్స్ అయినవాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే" అంటోంది ఇలియానా. ఆమె చాలా సన్నబడిందని జీరి సైజ్ అంటున్నారని మీడియా వాళ్ల దగ్గర ఇలా ఛాలెంజ్ విసిరింది.
అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించిన 'జులాయి', రవితేజతో చేసిన 'దేవుడు చేసిన మనుషులు' విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. "నా సినిమా విడుదల అవుతోందంటే నాకు ఒకటే కంగారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తారో లేదో.. అనే భయం ఉంటుంది. గాల్లో దీపం పెట్టి 'దేవుడా నువ్వే దిక్కు' అంటే ఉపయోగం ఏముంది? మేం చేసిన ప్రయత్నంలో నిజాయతీ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుందని నమ్ముతాను" అంది.
అలాగే తన మత విశ్వాసాలు గురించి చెపుతూ.. "నేను క్రిస్టియన్‌ని అయినప్పటికీ హిందూ దేవాలయాలకు వెళతాను. మాస్క్‌లకు కూడా వెళుతుంటాను. మనకన్నా పైన ఎవరో ఉన్నారని, ఆ శక్తే మనల్ని నడిపిస్తోందని నమ్ముతాను..అన్ని మతాల సారం ఒక్కటే అన్నది నా సిద్ధాంతం. దేవుళ్లందరినీ నమ్ముకొంటే కనీసం ఒక్క దేవుడైనా కరుణిస్తాడని నా ఆశ.." అని చెప్పింది.
జులాయి, దేవుడు చేసిన మనుషులు గురించి చెబుతూ .. "ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో గ్లామరస్ మాత్రమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి. ఆ పాత్రల్లో నా నటనను చాలామంది అభినందించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ రెండు చిత్రాల్లోనూ నటనకు స్కోప్ దొరికింది. కాబట్టి ఈ చిత్రాలు నాకు కాంప్లిమెంట్స్ తెచ్చిపెడతాయని భావిస్తున్నాను" అంది ఇలియానా.


Click it and Unblock the Notifications











