సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయడానికి ఇలియానా రెడీ...!
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో వున్న సినిమా 'రాణా'. రజనీకాంత్ ఇందులో మూడు పాత్రలు పోషించనుండడం ఒకటైతే, ఆ మూడు పాత్రలకు రకరకాల హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తుండడం మరొకటి! పెద్ద రజనీ క్యారెక్టర్ కి మొదట్లో రేఖని అనుకున్నారు. అయితే, రెమ్యూనరేషన్ విషయంలో తేడా వచ్చి ఇప్పుడామె తప్పుకుంది. ఆ స్థానంలోకి త్వరలో హేమమాలిని వస్తోందని సమాచారం.
మరో తాజా పరిణామం ఏమిటంటే, ఇద్దరు యంగ్ రజనీలలో ఓ పాత్ర పక్కన విద్యబాలన్ తప్పుకోవడంతో ఇలియానాను సెలెక్ట్ చేశారట. రజనీ సినిమా అనగానే ఈ గోవా సుందరి వెంటనే ఒప్పేసుకుందని చెబుతున్నారు. మరో రజనీ పక్కన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తుంది. ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో రజనీ గెటప్పులను ఫైనల్ చేయించుకు రావడానికి చిత్ర దర్శకుడు కె.యస్.రవికుమార్ వచ్చే నెలలో లండన్ వెళుతున్నాడు. మూడు పాత్రలు కాబట్టి మూడూ విభిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే, లండన్ లో ఆ గెటప్పులను డిజైన్ చేయిస్తున్నారు..!


Click it and Unblock the Notifications











