షాహిద్ కపూర్‌తో ఇలియానా
రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న 'బర్ఫీ' చిత్రంతో ఇప్పటికే బాలీవుడ్ అవకాశం దక్కించుకున్న ఇలియానా...ఆ చిత్రం రిలీజ్ కాకముందే మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది.
'Phata Poster Nikla Hero' చిత్రం పూర్తి మాస్ మసాలా బాలీవుడ్ ఎంటర్‌టైర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్స్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగే యంగ్ బాయ్స్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుందట. నవంబర్లో షూటింగ్ ప్రారంభించి 2013లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక పోతే ఇలియానా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధం కాబోతోంది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అపీషియల్ సమాచారం వెలువడలేదు.
ఇలియానా అల్లు అర్జున్‌కు జతగా నటించిన తెలుగు చిత్రం 'జులాయి' చిత్రం నాలుగు రోజుల క్రితం విడుదలైన మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన మరో చిత్రం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం ఆగస్టు 15 విడుదలకు సిద్ధం అవుతోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











