ఇలియానాకు జన్మదిన శుభాకాంక్షలు
స్లిమ్ బ్యూటి హీరోయిన్ ఇలియానా 24వ జన్మదిన వెడుకలను బుదవారం 19.08.09 జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా దట్స్ తెలుగు తరుపున అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటన్స్ ఆప్ ది డే. హీరోయిన్ ఇలియానాకు పర్సనల్ విషస్ తెలిపే వారు దట్స్ తెలుగు కామెంట్స్ ద్వారా తెలియజేయవచ్చు. ఇలియానా ముంబాయిలో పుట్టి, గోవా లో పెరిగింది. ఇలియానా యాక్టర్ గా రాక ముందు మోడల్ గా వున్నింది. ఇలియానా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వైవియస్ చౌదరి దర్శకత్వంలో 'దేవదాసు" సినిమా ద్వారా మంచి విజయాన్ని సాదించింది. 'పొకిరి" సినిమాలో మహేష్ బాబు సరసన నటించి టాలీవుడ్ లో టాప్ వన్ హీరోయిన్ గా నిలిచింది. రవితేజతో ఖతర్నాక్, రాకీ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ తో నటించి మంచి సక్సెస్ ను సాందించింది. తను నటించిన మున్నా, ఆట పెద్దగా రాణించక పోయినా. జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించి సెన్షేషనల్ హింట్ ను సాదించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సలీమ్, రెచ్చిపో సినిమాలో నటిస్తోంది. 'కిక్" సినిమాతో ఒక వూపందుకొన్న ఈ హాట్, సెక్సీ హీరోయిన్ బాలీవుడ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇలియానా 24వ జన్మదిన సందర్బంగా దట్స్ తెలుగు తరపున శుభాకాక్షలు తెలుపుతూ, తను తీస్తున్న కొత్త సినిమాలు సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాము.
ఇలియానాకు పుట్టిన రోజు శుభాకాంక్షులు తెలుపండి.


Click it and Unblock the Notifications











