హీరోయిన్ ఇలియానాను అరెస్టు చేసిన ముంబై పోలీసులు!
ముంబై: హీరోయన్ ఇలియానాను ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారుకు బోగస్ నెంబర్ ప్లేటు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ముంబై పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇలియానా ప్రయాణిస్తున్న కారు నెంబర్ రికార్డుల్లో లేదని తెలినట్లు సమాచారం. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం వెంటనే వదిలేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చసాగుతోంది. అయితే ఈ వార్తలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.

తన తాజా సినిమా 'మే తేరా హీరో' సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఆ కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కారు గురించిన వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత పోలీసులు ఆమెను వదిలి పెట్టినట్లు సమాచారం. ఇలియానా అరెస్టయినట్లు వచ్చిన వార్తలు వేగంగా వ్యాప్తి చెందాయి.
మీడియాలో తాను అరెస్టు అయినట్లు వస్తున్న వార్తలను విన్న ఇలియానా షాకైంది. తనను పోలీసులు అరెస్టు చేయలేదని, మీడియా వారే కావాలని ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని, ప్రస్తుతం తాను 'మే తేరా హీరో' సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని ఇలియానా చెప్పినట్లు భోగట్టా.


Click it and Unblock the Notifications











