ఆ ముగ్గురు హీరోలతో నటిస్తా: ఇలియానా
ఇలియానా మాట్లాడుతూ... ''తొలి ప్రయత్నంలోనే రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాను. ఇటీవల షాహిద్ కపూర్‌తోనూ జతకట్టాను. ఇప్పుడు నా దృష్టి ఖాన్ త్రయంమీదే ఉంది. షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లతో పాటు హృతిక్‌రోషన్‌తో కూడా తెరను పంచుకోవాలని ఉంది. ఏదో ఓ రోజు ఈ లక్ష్యాలన్నీ చేరుకొంటానన్న నమ్మకం ఉంది. డబ్బు, అవకాశాలు అని కాకుండా... నటనను ఆస్వాదిస్తున్నాను. నా సినీ జీవితంలో కీలక దశ ఇదే'' అని చెప్పుకొచ్చింది ఇలియానా.
అలాగే ...''అందంపైనే ఆధారపడాలనుకోలేదు. తెరపై కేవలం అందాలు ఆరబోయాలి, అవకాశాలు రాబట్టుకోవాలని అనుకొని ఉంటే 'బర్ఫీ'లాంటి చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టేదాన్ని కాదు. నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం'' అంటోంది ఇలియానా. తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఖరారు చేసి చెప్పారు.
బర్ఫీతో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో నటిస్తోంది. ఇప్పుడు మూడో చిత్రం కూడా సిద్ధమైంది. త్వరలో ఆమె సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించబోతోంది. ఈ సినిమాకి రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె. సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. సైఫ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.


Click it and Unblock the Notifications












