హాఫ్ రేటుకి ఫిక్స్ అయిపోయిన ఇలియానా...!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో డివివి దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నిటిస్తోంది. ఈ సినిమాకి 'హనీ"అనే టైటిల్ ని కూడా రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా ఇలియానాను తీసుకోవాలా వద్దా అనే డిస్కషన్స్ చాలా రోజులు జరిగిన విషయం తెలిసిందే. ఒక దశలో సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి ఇలియానాతో నటించడం అల్లు అర్జున్ కి ఇష్టం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఇలియానా ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ సినిమా వదులుకోకూడదని డిసైడ్ అయి తన పారితోషికంలో భారీగా డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో హ్యాపీగా ఫీల్ అయిన దర్శకనిర్మాతలు బన్నిని కన్విన్స్ చేసి ఇలియానాను ఓకే చేశారు. ఈ మధ్య కాలంలో ఐరన్ లెగ్ అయిపోయిన ఇలియానా ఈ సినిమాని ఏం చేస్తుందోనని అల్లు అర్జున్ కంగారు పడుతున్నాడట.


Click it and Unblock the Notifications











