twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడో..అక్కడో..ఎక్కడవున్నా ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు....!

    By Sindhu
    |

    ప్రస్తుతం త్రివిక్రమ్ దర్సకత్వంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ఇలియానా బాలీవుడ్ లోనూ కాలు మోపిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ సరసన 'బర్ఫీ" చిత్రంలో నటిస్తున్న ఇలియానా, ఆక్షయ్ కుమార్ సరసన 'ఖిలాడి 786′ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. కాగా బర్ఫీ చిత్ర విశేషాలను గురించి ఆమెను ప్రశ్నించిన పాత్రికేయులతో మాట్లాడుతూ బాలీవుడ్ లో ఎప్పుడు షూటింగ్ అంటారో ఎప్పుడు పేకప్ చెప్తారో తెలియదని, గుర్తొచ్చినపుడు షూటింగ్ అంటారని తెలిపారు. వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఆ చిత్రానికి కేటాయించిన తేదీల వల్ల తెలుగులో రెండు మూడు భారీ చిత్రాలను వదులుకోవాల్సి వచ్చింది అన్నారు. బర్ఫీ చిత్రం విజయం సాదిచినప్పటికి ఇకపై తన ప్రాధాన్యం తెలుగు చిత్రాలకే ఇస్తానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల్లో వున్నాయని త్వరలోనే వివరాలు తెలియచేస్తానని అన్నారు.

    టాలీవుడ్ లో తమన్నా తనకు గట్టి పోటీనిస్తున్నప్పటికీ, ఎండార్స్ మెంట్ల విషయంలో మాత్రం గోవా బ్యూటీ ఇలియానానే ముందుంది. తాజాగా జరిగిన ఓ ఎండార్స్ మెంట్ విషయంలో ఇది ప్రూవ్ అయింది. 'ఫర్ ఎవర్' జువేలేరీ కి బ్రాండ్ అంబాసడార్ గా సైన్ చేసిన ఇల్లీ బ్యూటీ, అందుకు గాను కోటి రూపాయలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే బ్రాండ్ కి ఆంధ్రా, తమిళనాడు ప్రాంతాలకు తమన్నా 70 లక్షలకు సైన్ చేసింది. ఇలియానా దేశం మొత్తానికి ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్, ప్రచార చిత్రాల షూటింగులో ఇలియానా ఇటీవల పాల్గొంది. త్వరలో వీటిని రిలీజ్ చేస్తారు. ఏమైనా, సినిమాల పరంగా పారితోషికం తగ్గించుకున్నా, కమర్షియల్స్ విషయంలో మాత్రం ఇలియానా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు!

    English summary
    Despite being rumored to have reduced her paycheck following successive failures, Ileana D'Cruz has signed a hefty endorsement deal. In fact, the actress, who has now become the face of 'Forever' jewellery line, has beaten Tamanna Bhatia at the commercial world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X