ఇలియాన, బ్రహ్మానందం జంప్!
తెలంగాణ వాదులు సినిమా షూటింగ్ పై దాడి చేయడంతో...ఆ సమయంలో షూటింగులో పాల్గొన్న హీరోయిన్ ఇలియాన, కామెడీ స్టార్ బ్రహ్మానందం అక్కడి నుంచి జంప్(వెళ్లి పోయారు)అయ్యారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కెపిహెచ్ పి కాలనీలోని ఓ ఆసుపత్రిలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సినిమా షూటింగ్ అర్థాంతరంగా ఆగి పోయింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో భాగంగా ఇక్కడ చిత్రీకరణ చేస్తున్నారు.
తెలంగాణ వాదులు ఒక్కసారిగా దూసుకు రావడంతో ఇలియాన, బ్రహ్మానందం హడలి పోయినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. తమ ఏమైనా చేస్తారేమోనని వనికి పోయినట్లు సమాచారం. అయితే అక్కడ వారంతా ఆ ఇద్దరిన భద్రంగా వారి వాహనాలు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు.


Click it and Unblock the Notifications











