DCM షూటింగ్ లో... కంటతడి పెట్టిన ఇలియానా

By Bojja Kumar

గోవా సుందరి ఇలియానా ప్రస్తుతం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం షూటింగ్ చివరి రోజు ఇలియానా సెట్లో కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇలియానా కంతడికి కారణం షూటింగ్ అయిపోవడమేనట. ఇన్నాళ్లు యూనిట్ సభ్యులతో కలివిడిగా ఉన్న ఇలియానా....అంతా దూరం అవుతున్నారనే బాధతో ఉద్వేగాన్ని ఆపుకోలేక పోయిందని, అందుకే కంటతడి పెట్టిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. హీరో రవితేజ, దర్శకుడు పూరి సర్దిచెప్పడంతో ఏడుపు ఆపేసిందట.

రవితేజ, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుదిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో బీవిఎస్ఎన్ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కథలేకుండానే ఈ చిత్రాన్ని తీస్తున్నానని, సినిమాలో లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే మంచి ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుందని అంటున్నాడు దర్శకుడు.

ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం: రఘు కుంచె, ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత: బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X