వాళ్లకి బాధ కలిగిస్తే నేనేం చేయలేను: ఇలియానా
ఒకే వారం గ్యాప్ లో ఇలియానా నటించిన రెండు చిత్రాలు( 'జులాయి' ,'దేవుడు చేసిన మనుషులు' ) విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఆమెకు ఊహించినంత కిక్ ఇవ్వలేదు. దేముడు చేసిన మనుష్యులు ఆల్రెడీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. జులాయి కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు. దాంతో ఆమెకు తెలుగులో ఊహించిన క్రేజ్ రాలేదు. దాంతో ఇలియానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
సాధారణంగా మంచి సక్సెస్ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది. అయితే ఆమె హిందీలో సినిమాలు చేస్తూండటంతో ధైర్యంగా ఉంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న బర్ఫీ చిత్రం హిట్ కావటం అవార్డులకు నామినేట్ కావడంతో అక్కడ నిలదొక్కుకోవచ్చు అనే ఆలోచనలో ఉంది. మరో ప్రక్క ఆమె తమన్నా, సమంత, కాజల్‌తో విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది.
ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. 'Phata Poster Nikla Hero' చిత్రం పూర్తి మాస్ మసాలా బాలీవుడ్ ఎంటర్‌టైర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్స్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగే యంగ్ బాయ్స్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుందట. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి 2013లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












