ఇలియానా చేతిలో మూడు పెద్ద సినిమాలు
సలీం, రెచ్చిపో అంటూ రెండు ప్లాఫ్ లు ఇచ్చినా ఇలియానాకు డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆమె 2010లో మూడు సినిమాల షూటింగ్ లతో పూర్తి స్ధాయి బిజీగా ఉండనుంది. అవి జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రానున్న శక్తి చిత్రం, విక్రమ్ తో తెలుగు, తమిళ భాషల్లో తయారుకానున్న 24 అనే చిత్రం, అలాగే సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రామ్ హీరోగా చేయనున్న చిత్రం ఒకటి. వీటిల్లో శక్తి చిత్రం జనవరి 2010 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. అనంతరం పిబ్రవరి చివర వారం నుంచి విక్రమ్ తో చేస్తున్న బైలింగ్వల్ చిత్రం ప్రారంభం అవుతుంది. సురేంద్రరెడ్డితో చేస్తున్న స్రవంతి రవికిషోర్ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రారంభమవుతుంది. ఈ విషయాలను స్వయంగా ఇలియానే చెప్పుకొచ్చింది. ఆమె తాజాగా బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. మొదట చార్మి ఈ బ్రాండ్ కి పనిచేసింది. అనంతరం ఆమె ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. తాజాగా ఈ ప్లేస్ ను ఇలియానా అందిపుచ్చుకుంది. ఈ విషయమై ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్తోంది. మొత్తానికి 2010 మొత్తం ఆమెదే అయ్యేటట్లు ఉంది.


Click it and Unblock the Notifications











