మనసు మార్చుకున్న ఇలియానా
తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న ఇలియానా కొంత కాలంగా మీడియాకు మొహం చాటేస్తూ వస్తోంది. ఒక హీరోతో ఆమెకు ప్రత్యేక సంబంధాని అంటగడుతూ మీడియాలో వార్తా కథనాలు రావడంతో ఆగ్రహించిన ఇలియానా మీడియా కళ్ళకు కనబడకుండా తప్పించుకుని తిరుగుతోంది.
ఇప్పుడు ఇలియానా పారితోషికం కోటి రూపాయలకు చేరుకుంది. ఇంత భారీ ఫీజు తీసుకుంటున్న ఆమె నిర్మాతల న్యాయ బద్ధమైన కోర్కెలను నెరవేర్చాలనుకుంటోంది. గతంలో సినిమాల ప్రమోషన్ లో ఆమె పాలు పంచుకునేది కాదు. తాజా చిత్రం " భలే దొంగలు" సినిమా ప్రమోషన్లలో ఆమె పాలు పంచుకుంటోంది. అందులో భాగంగా ఇంటర్వ్యూలు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పవన్ కళ్యాణ్ "జల్సా" ప్రమోషన్లలో కూడా అమె యాక్టివ్ అయింది.


Click it and Unblock the Notifications











