నా రేంజ్ మాత్రం తగ్గడం లేదు..ఇలియానా !
ఒకప్పుడు ఇలియానా వల్ల ఓపెనింగ్స్ బాగా వస్తాయని అన్న నోళ్లతోనే ఇప్పుడు ఆమెని ఐరెన్ లెగ్ అని నిర్థాక్షిణ్యంగా కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ జనం. సక్సెస్ లేకపోతే ఇక్కడ ఎవరికైనా తగిన మర్యాద దక్కదు పాపం..ఇలియానానైతే 'శక్తి" సినిమా విషయంలో జరిగిన గొడవ వల్ల మరింతగా టార్చర్ పెట్టేస్తున్నారు. అక్కడికి తామేదో గోల్డెన్ లెగ్గులన్నట్టు. వరుస ఫ్లాపులిస్తున్నా కానీ ఇలియానాని దూరంగా పెడుతున్నారు.
అయితే చింత చచ్చినా పులుపు చావదంటారు...గోవా బ్యూటీ ఇలియానాకి ఇది కరెక్ట్ గా సరిపోతుందేమో! ఎందుకంటే, ఓపక్క హిట్లు లేకపోయినా... ఇరెన్ లెగ్ బ్రాండ్ పడిపోయినా కూడా రేమ్యునేరేషన్ విషయంలో మాత్రం పట్టుసడలడంలేదు. ఇందుకు తాజాగా రజనీకాంత్ నటించే 'రాణా' సినిమానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఆమె పదిహేను రోజుల డేట్స్ ఇచ్చింది. అందుకుగాను 60 లక్షలు చార్జ్ చేస్తోంది. అదే అందులో మెయిన్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చి, రెండు కోట్లు తీసుకుంటోందట. ఈ లెక్కన ఇలియానా పారితోషికమే ఎక్కువన్న విషయం మనకు ఇట్టే అర్ధమవుతుంది. ఇప్పటికే శంకర్ రూపొందించిన 'నన్బన్' సినిమాకి కోటిన్నర తీసుకుని ఇలియానా వార్తల్లోకెక్కింది. అందుకే, ఈ ముద్దుగుమ్మ అంటే నిర్మాతలు భయపడేది.
ఈ సంవత్సరం తనకేం భయం తేదంటూ తను చాలా బిజీగా ఉన్నానంటోంది ఇలియానా ఎందుకంటే బాలీవుడ్ లో ఎంటర్ అయి అనురాగ్ బసు దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో 'బర్ఫీ" సినిమా లో నటిస్తోంది. అలాగే టాలీవుడ్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లోనూ, రవితేజ-పూరి కాంబినేష్ లో నటిస్తున్న ఇలియానా తను మునపటి క్రేజ్ ను పొందగలననే నమ్మకంతో నా రేంజ్ మాత్రం తగ్గలేదంటోది. సో ఇలియానా ఏ ఒక్క సినిమా విడుదలైన ఐరెన్ లెగ్గా, గోల్డెన్ లెగ్గా అనేది తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











