'శక్తి' చిత్రం విషయంలో నా మాటలు వక్రీకరించారు: ఇలియానా
శక్తి ప్రాజెక్టు నచ్చడంతోనే చేశాను.అయితే సినిమా నచ్చకపోతే ప్రచారం చేయను అన్నానంటూ నా మాటలు వక్రీకరించారు. నేను నిజంగా అలా వ్యాఖ్యానించలేదు. వైజయంతి సంస్థ, ఎన్టీఆర్ హీరో కాబట్టే ఆ సినిమా ఆడియో వేడుకలో డ్యాన్స్ కూడా చేశాను. అదే నా తొలి బహిరంగ నృత్య ప్రదర్శన. ఎప్పుడూ నేను సినిమా ప్రచారానికి విముఖంగా ఉండను అంటూ క్లారిటీ ఇచ్చింది ఇలియానా. అలాగే నేను..నా రాక్షసి, శక్తి సినిమాలు వరసగా ఫ్లాప్ కావటం గురించి మాట్లాడుతూ..పరాజయాలకు ప్రత్యేకించి కారణాల్ని వెదికిపట్టుకోలేం. మంచి విజయం కోసమే సినిమా యూనిట్ ంతా శ్రమిస్తుంది. అయితే ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు. నేను ప్రతి సినిమాకీ ఒకే రీతిన కష్టపడ్డాను. ఏది ఏమైనా నా వరకూ ప్రతి సినిమా ఒక పాఠమే. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను అంది. ప్రస్తుతం ఇలియానా 'త్రీ ఇడియట్స్' రీమేక్ లోనూ, హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న బర్ఫీ చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











