twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జులాయి’లో ఎందుకంత సన్నగా ఉన్నానంటే... : ఇలియానా

    By Srikanya
    |

    హైదరాబాద్ : కరువు దేశానికి బ్రాండ్ అంబాసిడిర్ లా ఉందంటూ ఇలియానాను జులాయిలో త్రివిక్రమ్ బ్రాండింగ్ ఇచ్చారు. దానికి కారణం ఆమె చాలా సన్నగా ఉండటమే... ఈ విషయమై ఆమెను మీడియా కలిసి కదిపినపప్పుడు...'జులాయి' సినిమాలో నేను చాలా సన్నగా ఉన్నానని కొన్ని కామెంట్లు వచ్చాయి. వాటి గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే... 'జులాయి' చేసే టైమ్‌లోనే నేను మూడు సినిమాల్లో నటించాను. ఆ మూడింటిలోనూ మూడు రకాల పాత్రలు చేశాను. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర 'బర్ఫీ'లోని శ్రుతి పాత్ర. ఆ పాత్ర స్లిమ్‌గా ఉండాలి. అందుకే ఆ పాత్ర కోసం సన్నబడ్డాను. ఈ కారణంగానే మిగిలిన సినిమాల్లో సన్నగా కనిపించాను అని తేల్చి చెప్పింది.

    ఇక నా నాజూకుతనం బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. 'బర్ఫీ' ట్రైలర్స్ విడుదలైనప్పటినుంచీ నాకొస్తున్న అభినందనలే అందుకు నిదర్శనం. కానీ నా నాజూకుతనం తెలుగు ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. ప్రస్తుతం నేను తెలుగు హీరోయిన్‌ని కాబట్టి, వారి ఇష్టానుసారంగా నేను ఉండాలి కాబట్టి బరువు పెరగాలని నిశ్చయించుకున్నాను. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నాను కూడా అని చెప్పింది ఇలియానా.

    ఇలియానా ఆనందానికి కారణం 'జులాయి' సినిమానే. టాలీవుడ్‌లో 40 కోట్లు వసూలు చేసిన చిత్రాల వరుసలో 'జులాయి' కూడా చేరబోతుండటంతో ఇల్లూ బేబీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 'జులాయి'సినిమా గురించి ఆమె మాట్లాడుతూ- ''ఈ సినిమాలోని 'మధు' పాత్రను నేనెంతో ప్రేమించి చేశాను. రకరకాల హావభావాలను పలికించే అవకాశం ఈ పాత్ర నాకిచ్చింది. తెరపై నా పెర్‌ఫార్మెన్స్ చూసుకొని నన్ను నేనే అభినందించుకున్నాను. ఇంతటి మంచి పాత్రను నాకిచ్చిన త్రివిక్రమ్‌సార్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ సాధించడం నాకు కొత్త ఊపిరి వచ్చినట్టయ్యింది అంది.

    English summary
    Ileana happy with her latest Julai film. She says that her character in Julai as Madhu gets huge respose and also thanks to Trivikram srinivas
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X