పవన్ కళ్యాణ్ సినిమాపై ఇలియానా పొగడ్తల వర్షం..ఆ సినిమా విసుగు తెప్పించిందట!
Recommended Video

హీనా ఖాన్, తాప్సి.. ఇప్పుడు ఇలియానా ఈ ముద్దు గుమ్మలు సౌత్ సినిమాలపై ప్రత్యేకించి టాలీవుడ్ పై చేసిన వాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఇలియానా టాలీవుడ్ పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలియానా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె నటించిన తొలి చిత్రం దేవదాసు పై విమర్శలు గుప్పించిన ఇలియానా సిద్దార్థ్ తో నటించిన ఆట చిత్రంపై కూడా విమర్శలు చేసింది. అలాగే టాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రాల్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలు రెండు ఉన్నాయట. ఒకటి పవన్ కళ్యాణ్ తో చేసిన జల్సా చిత్రం మరోకటి రవితేజ సరసన నటించిన కిక్. ఈ రెండు చిత్రాలు టాలీవుడ్ లో ఇలియానాకు సంతృప్తినిచ్చాయట.

ఆ సినిమాలతో విసిగిపోయా
తాను నటించిన తొలి చిత్రం దేవదాసు మొదలుకొని వరుసగా అదే తరహా పాత్రలు వచ్చాయి. పోకిరి, ఖరత్నాక్ మరియు తమిళ చిత్రం కేడి లో తనని ఓ గ్లామర్ వస్తువుగా మాత్రమే చూసారని ఇలియానా మండిపడింది.

సినిమాలు ఆపేద్దాం అనుకున్నా
వరుసగా అదే తరహా పాత్రలు వస్తుండడంతో సౌత్ లో సినిమాలకు స్వస్తి చెప్పాలని అనిపించినట్లు ఇలియానా తెలిపింది.

ఆటలో పరాకాష్ట
తనని ఓ గ్లామర్ వస్తువువగా మాత్రమే చూశారు అని చెప్పడానికి ఆట చిత్రం పరాకాష్ట అని ఇలియానా తెలిపింది.

పవన్ చిత్రంపై పొగడ్తలు
టాలీవుడ్ చిత్రాలతో విసిగిపోతున్న తరుణంలో జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందని, తన కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రాలలో జల్సా చిత్రం ఒకటని ఇలియానా తెలిపింది.

మంచి కిక్ ఇచ్చింది
రవితేజ సరసన నటించిన కిక్ చిత్రాన్ని కూడా తాను మరచిపోలేనని తెలిపింది. జల్సా, కిక్ చిత్రాలు తనకు ప్రత్యేకమైనవిగా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











