శక్తి పబ్లిసిటి స్టిల్స్‌లో నేను అందంగా కనిపించడానికి కారణం
గోవా సుందరి ఇలియానా ఇప్పుడు మరింత ఉత్సాహంగా వున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆమె తాజా చిత్రం 'శక్తి" పబ్లిసిటి స్టిల్స్‌లో తను చాలా అందంగా వున్నారని, క్యూట్‌గా కనిపిస్తున్నానని అందరూ ఆమెపై ప్రశంసలు కురిపించడమే ఇలియానా ఉత్సాహనికి కారణం. 'రాఖీ" తర్వాత ఈ అందాలభామ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న రెండో చిత్రం 'శక్తి". ఈ చిత్రంలో తన గెటప్‌తో పాటు పాత్ర కూడా అందర్ని ఆశ్చర్యపరిచే విధంగా వుంటుందని అంటున్నారు ఈ క్రేజీ గాళ్.
ముఖ్యంగా ఈ చిత్రంలో తన కాస్ట్యూమ్స్ అదిరిపోయే విధంగా వుంటాయని మురిసిపోతున్నారు ఆమె. ఈ అగ్రకథానాయిక ఇటీవల వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఆమె తల్లి సమీరా డి క్రూజ్ స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో 'ఇలియానా" పేరు మీద హైదరాబాద్‌లో బొటిక్ ప్రారంభించారు. ఈ విషయం గురించి ఇలియానా మాట్లాడుతూ ''మా అమ్మ డిజైన్ చేసిన డ్రెస్‌లంటే నాకు చాలా ఇష్టం.
దాదాపు నేను ధరించే అన్ని దుస్తులూ తను డిజైన్ చేసినవే. సినిమాల్లో నేను ధరించే కాస్ట్యూమ్స్ విషయంలో డిజైనర్‌తో పాటు అమ్మ సమీరా సలహా కూడా తీసుకుంటాను. ట్రెడిషనల్, ఫార్మల్ కలెక్షన్స్‌ను డిజైన్ చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఇక నుంచి అమ్మ కలెక్షన్స్ నాకే కాదు అందరికీ తప్పకుండా నచ్చుతాయి"" అన్నారు ఇలియానా. ఇక తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను అభిమానులే అతిథులుగా ఈ నెల 27న హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో అత్యంత వైభవంగా జరపనున్నామని అశ్వనీదత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











