నెటిజన్ ప్రశ్నకు సరైన రిప్లై.. బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టేసిన ఇలియానా
ఇలియానా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌ను కట్టిపడేసింది ఈ గోవా సుందరి. దేవదాస్ సినిమాతో రామ్ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశమే రాలేదు. వరుసగా ఆఫర్లు వెల్లువెత్తడంతో ఇలియానా దశ తిరిగిపోయింది. అతి కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారిపోయింది.

స్టార్ హీరోలతో..
వచ్చీ రావడంతోనే ఇలియానా టాప్ హీరోలతో నటించేసింది. దేవదాస్ హిట్ అవ్వడంతో వెంటనే పోకిరి వంటి బ్లాక్ బస్టర్‌ను పట్టేసింది. అలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోల పక్కన నటించేసింది. స్టార్ హీరోల పక్కన చేస్తూనే కుర్ర హీరోలతోనూ ఇలియానా జత కట్టేసింది.

బాలీవుడ్ పయనం..
టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో ఇలియానా బాలీవుడ్‌కు చెక్కేసింది. కానీ అక్కడ మాత్రం ఇలియానాకు సరైన హిట్ రాలేదు. ఏదో అడపాదడపా చిత్రాలను చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. అయితే ఆ మధ్య తెలుగులో మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని చూసింది. కానీ దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి డిజాస్టర్లు రావడంతో మళ్లీ సైలెంట్ అయిపోయింది.

ప్రియుడితో అలా..
మధ్యలో కొన్నేళ్లు ఇలియానా తన ఆస్ట్రేలియన్ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆండ్రూ నీబోనే అనే ఫోటో గ్రాఫర్‌తో ఇలియానా పీకల్లోతు ప్రేమల్లో మునిగింది. కానీ మళ్లీ చివరకు కథ బ్రేకప్‌తో ముగిసిపోయింది. 2019లో ఈ ఇద్దరి ప్రేమకు ఎండ్ కార్డ్ పడింది. అప్పటి నుంచి ఇలియానా ఒంటరిగానే ఉంటోంది.

సోషల్ మీడియాలో హల్చల్..
అయితే ఇలియానాకు వెండితెరపై ఎలాంటి ఆఫర్లు లేకపోయినా కూడా నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. బికినీ, బీచ్‌లంటూ హాట్ హాట్ ఫోటోల్లో మెరిసి కుర్రకారును ఫిదా చేసేస్తుంటుంది. తాజాగా ఇలియానా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అందులో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు అడిగారు.

బాయ్ ఫ్రెండ్ పేరు..
ఎక్కడున్నావ్?. వంటలు చేయడం వచ్చా? నీకు నచ్చిన వ్యక్తి ఎవరు? ఇలా రకరకాలుగా ఇలియానాను ప్రశ్నించారు నెటిజన్లు. అందులో ఓ నెటిజన్ మాత్రం నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి? అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్పందించిన ఇలియానా.. తన పెట్ ఫోటోను షేర్ చేస్తూ.. అతడి పేరు చార్లీ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











