For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏవీ కూడా ఉండాల్సినంత ఉండవట.. అంగాంగాన్ని వివరించిన ఇలియానా.. బికినీ పిక్‌తో ట్రీట్!!

  |


  'దేవదాస్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే దేవదాసులను చేసింది. ఆపై కుర్రకారునంతా పోకిరీలను చేసింది. తన వెంట తిప్పుకుంటి. అందాల వల వేసి ఖతర్నాక్‌గా ప్రేక్షకులను కట్టిపడేసింది ఇలియానా. అభిమానులతో జల్సాలు చేయించి.. జులాయిలుగా మార్చేసింది. ఇలియానా కుర్రకారుకు డ్రీమ్ గర్ల్. తెలుగులో ఇలియానాకు వచ్చినంత క్రేజ్ మరేతర హీరోయిన్లకు రాలేదు. అంతటి తక్కువ కాలంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రికార్డులు క్రియేట్ చేసింది.

  ఇక్కడి క్రేజ్‌తో..

  ఇక్కడి క్రేజ్‌తో..

  ఉత్తరాది భామలు టాలీవుడ్‌లో మొదట లక్‌ను పరీక్షించుకుంటారు. ఇక్కడ బాగానే సెటిల్ అవుతారు.. ఫాలోయింగ్, క్రేజ్, నేము, ఫేము ఇలా అన్నీ తెచ్చుకుంటారు. మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేస్తుంటారు. అలా ఇలియానా కూడా బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఇక్కడ వచ్చిన క్రేజ్‌లో అక్కడ అవకాశాలను సంపాదించుకుంది కానీ సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ వెనక్కి తిరిగి వస్తే ఇక్కడా విజయాలు పలకరించలేదు.

  సోషల్ మీడియాలో రచ్చ..

  సోషల్ మీడియాలో రచ్చ..

  ఇక సినిమాలు సరిగ్గా ఆడకపోయే సరికి కొన్ని రోజులు ఆండ్రూ నీబోస్ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడిపోయింది. అది కూడా మధ్యలోనే వీగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఇలియానా చేసే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. బికినీ ఫోటోలు, స్టిల్స్‌ను షేర్ చేయడంలో ఇలియానాది ప్రత్యేక శైలి. తాజాగా బికినీ ఫోటోను షేర్ చేసిన ఇలియానా తన శరీరాంగాలపై సంచలన కామెంట్స్ చేసింది.

  ఉండాల్సినంత ఉండవు..

  ఉండాల్సినంత ఉండవు..

  నేను బయటకు ఎలా కనిపిస్తానా? అని ప్రతీసారి ఆందోళన చెందుతాను.. నా హిప్స్ బాగా లావుగా ఉంటాయని బాధపడుతుంటాను. నా తొడలు కూడా వెరైటీగా ఉంటాయి. నా నడుము అంత విశాలంగా కూడా ఉండదు.. నా వక్షోజాలు అంత పెద్దవి కూడా కాదు.. నా బట్ చాలా పెద్దగా ఉంటుంది.. నా చేతులు కూడా భిన్నంగా ఉంటాయి.. ముక్కు కూడా స్ట్రెయిట్‌గా ఉండదు వంకరటింకరగా ఉంటుంది.. పెదాలు కూడా ఉండాల్సినంత ఉండవు.. నేను మరీ అంత పొడవుగా కూడా లేనని బాధపడుతుంటాను. నేను అంత అందంగా కూడా లేను.. అంత పర్ఫెక్ట్ కూడా కాను.. నేను ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలని కూడా అనుకోలేదు. నేను అంతర్గతంగా అందంగా ఉన్నాను అంటూ ఇలియానా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

  Ileana D'Cruz, Gauri Khan Clicked In Mumbai
  నాకంటూ ఓ ప్రత్యేకత..

  నాకంటూ ఓ ప్రత్యేకత..

  భిన్నంగా, చమత్కారంగా, కొత్తగా, ప్రతి మచ్చ, ప్రతి బంప్, ప్రతి లోపం నన్ను, నన్నుగా తీర్చిదిద్దింది. నాకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే అందానికి ఈ ప్రపంచం ఇచ్చే నిర్వచనంతో నన్ను నేను పోల్చుకోకుండా ఆగిపోయాను. అయినా నేను ఎందుకు ఉండాలి.. నేను నా కోసం నా కాళ్ల మీద నిలబడటానికి పుట్టినప్పుడు అంటూ ప్రశ్నలను సంధించింది. ఒకరు నిర్ణయించినట్టుగా ఉండాల్సిన పనిలేదని ఇలియానా చెప్పకనే చెప్పింది.

  English summary
  Ileana D'cruz ABout Meaning of Beauty And Body Parts, ’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough..... I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X