»   » ఇలియానా భలే చాన్స్ కొట్టేసింది: ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్

ఇలియానా భలే చాన్స్ కొట్టేసింది: ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ ఇలాయానా భలే చాన్స్ కొట్టేసింది. అయితే ఇదేదో సినిమా ఛాన్స్ మాత్రం కాదు. అంతకు మించిన అవకాశం అనే చెప్పాలి. 'ఫిజీ' అనే దేశ పర్యాటక రంగం తరఫున భారత్‌లో ప్రచారం చేయడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడింది.

ఇప్పటి వరకు తన అందచందాలు, టాలెంటుతో ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో సక్సెస్ అయిన ఇలియానా... ఇపుడు అదే టాలెంటు ఉపయోగించి ఫిజీ దేశానికి పర్యాటకులను రప్పించడానికి కంకణం కట్టుకుంది.

Ileana DCruz appointed as Tourism Fijis brand ambassador

తకు ఈ అవకాశం రావడంపై ఇలియానా స్పందిస్తూ ''ప్రకృతి అందాలకు కొలువైన ఫీజీ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం హ్యాపీగా ఉందని, వారి ఆతిథ్యం, ప్రేమ ఎంతో నచ్చింది. సొంతింటిలో ఉన్న ఫీలింగ్‌ కలిగించింది. ఇక్కడ చూడాల్సిన బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ చూసొస్తాను' అని వెల్లడించింది.

ఇలియానాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇక్కడి జనాభాలో 38 శాతం భారతీయ సంతతికి చెందిన వారే. ఇండియాలో మాదిరిగానే అక్కడ కూడా దీపావళి, వినాయక చవితి లాంటి భారతీయ పండుగలు నిర్వహిస్తారు. ఇక్కడికి ఇండియా నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. వారిని ఆకర్షించడానికే ఇలియానాను నియమించారు. గతంలో కూడా పరిణితీ చోప్రా ఆస్ట్రేలియా, సిదార్థ్‌ మల్హోత్రా న్యూజిల్యాండ్ బ్రాండ్‌అంబాసిడర్లుగా నియమితులయ్యారు.

Read more about: ileana ఇలియానా
English summary
Ileana D'Cruz appointed as Tourism Fiji's brand ambassador. "I'm so happy to be associated with a beautiful country like Fiji. The warmth, hospitality, and love the Fijian people have shown me make me feel like I'm home. I cannot wait to go back and explore more of this lovely paradise," Ileana said in a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X