»   » ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్)

ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిట్టి నడుము సుందరి ఇలియానా కొంత కాలంగా బాలీవుడ్లో కాస్త డౌన్ అయినా మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 'బర్ఫీ' సినిమాతో 2012లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమా హిట్ కావడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే ఆ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఒక్కసారిగా ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి.

2014లో ఇలియానా నటించిన చివరి సినిమా 'హ్యాపీ ఎండింగ్' విడుదలై ప్లాప్ అయింది. అప్పటి నుండి ఆమెకు అవకాశాలే లేవు. అయితే ఈ గ్యాపులో తన బాయ్ ఫ్రెండుతో ఎంజాయ్ చేసిన ఇలియానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న 'రుస్తుం' మూవీలో నటిస్తోంది. దీంతో పాటు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'బాద్ షా హో' అనే మరో సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

ఇలియానా సినిమాల్లో బిజీ కావడంతో అటు పలు మేగజైన్లు కూడా ఆమె ఫోటో షూట్లు చేసేందుకు సిద్దమవుతున్నాయి. తాజాగా ఇలియానా 'ఫెమీనా బ్రైడ్స్' కోసం సూపర్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఈ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి పలు ఆసక్తికర మైన విషశేషాలు చెప్పుకొచ్చింది. త్వరలోనే ఆ విషయాలు మీకు తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇలియానా హాటోలపై ఓ లుక్కేయండి.

ఇలియానా

ఇలియానా

ఫెమీనా బ్రైడ్ మేగజైన్ కవర్ పేజీపై ఇలియానా...

సెక్సీలుక్

సెక్సీలుక్

ఈ మేగజైన్లో ఇలియాన లుక్ ను మరింత సెక్సీగా ప్రజెంట్ చేసారు.

మోడ్రన్ గర్ల్

మోడ్రన్ గర్ల్

ఇలియానా బాడీ స్లిమ్ గా ఉండటంతో మోడ్రన్ లుక్ దుస్తుల్లో బాగా ఇమిడి పోతోంది.

బాయ్ ఫ్రెండ్

బాయ్ ఫ్రెండ్

ఇలియానా తన బాయ్ ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూను పెళ్లాడే అవకాశం ఉంది.

English summary
Ileana D'Cruz Looks Ravishing On The Cover Of Femina Brides Magazine ... on the Cover Page of Femina Brides magazine July 2016 issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu