సైజు తగ్గించుకొనున్న ఇలియానా.. అందుకు నేను రెడీ!
Recommended Video

టాలీవుడ్‌లో అందాల తార ఇలియానా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి పక్కన నటించి హిట్లు అందించింది. అయితే ఉన్నట్టుండి సినిమాలు క్యూ కట్టడంతో ఒక్కసారిగా తెలుగు తెరకు దూరమైంది. అయితే ఇప్పుడు అవకాశాలు పెద్దగా లేకపోవడంతో బిగ్ స్క్రీన్ నుంచి బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌లో గడ్డుపరిస్థితి
తెలుగు సినిమాలు, దక్షిణాదిలో అవకాశాలు తక్కడంతో ఇలియానా బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో సిల్వర్ స్క్రీన్‌ను వదిలేసి రూటు మార్చే అంశంపై దృష్టిపెట్టింది.

అలాంటివాటిని పట్టించుకోను..
టెలివిజన్‌లో మంచి కంటెంట్ ఉన్న కార్యక్రమాలు వస్తే నటించడానికి సిద్ధం. బుల్లితెర, బిగ్ స్క్రీనా అనేది నేను పట్టించుకొను. అవకాశాలు మంచిగా ఉండి, అవి నాకు ఛాలెంజ్ అనిపిస్తే నేను టెలివిజన్ రంగంలో ప్రవేశించడానికి రెడీగా ఉన్నాను. నాకు స్క్రీన్ సైజుతో నాకు పనిలేదు అని ఇలియానా ఇటీవల చెప్పింది.

ఫోటోగ్రాఫర్‌తో అఫైర్
బాలీవుడ్, టాలీవుడ్ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఇలియానా బాయ్‌ఫ్రెండ్‌తో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నది. బాయ్‌ఫ్రెండ్ షూట్ చేసే ఫోటోషూట్లకు హాట్ హాట్‌గా ఫొజిస్తూ హల్‌చల్ చేస్తున్నది. అండ్రూ నీబోన్ అనే ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్‌తో ఇలియానాకు అఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

ముబాకరన్ చిత్రంలో
2017లో ముబాకరన్, బాద్షాహో అనే రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందిన ముబాకరన్ చిత్రంలో అతియాశెట్టి, అర్జున్ కపూర్, అనిల్ కపూర్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం త్వరలో రీలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











